Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం ఎంఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం జరిగిన సభలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుల్తానా మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై ముఖ్యమంత్రి చిన్న చూపు చూస్తున్నారని, కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాలన్నారు. పలు సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్కు వినతులు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ, పద్మ, నాగేంద్ర, ఐలమ్మ, పద్మ, జయ తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గూడెపూరి రాజు డిమాండ్ చేశారు. సోమవారం పాల్వంచ విద్యాశాఖ కార్యాలయంలో కార్యాలయ సిబ్బందికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన యూనియన్ నాయకురాలు వై.రాధమ్మ, ఆర్.పద్మ, కృష్ణవేణి, లక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.