Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : భద్రాచలం
మన చుట్టు దాగి ఉన్న కామాందులలో ఓటు బ్యాంకు రాజకీయపు నేతలలో మార్పు రావాలి అంటే ఒక్కరోజు పోరాటాలు సరిపోవు అని ప్రతి వ్యక్తిని చైతన్య పరిచే పోరాటాలు జరగాలని, చట్టాలలో సమూలమైన మార్పులు రావాలని బంజారా సేవ సమితి నాయకులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి భద్రాచలంలో చైత్రకు నివాలర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమం మీడియాలో ప్రత్యక్ష ప్రసారాలు జరపాలని, అప్పుడే అటువంటి నరరూప రాక్షసుల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దిశా కమిటి డైరెక్టర్ లకావత్ వెంకటేశ్వర్లు, బి.చంద్ర కాంత, బి.బాన్సిలాల్, వి.కృష్ణ, బి.గోవిందు, జీ.రాజు, బి.సైదులు, జీ.సైదులు, బి.జుంలాల్, జీ.రాందాస్, బి.నాగేశ్వరావు, బి.తార చంద్, బి.భావసింఫ్ు తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : హైదరాబాద్ సింగరేణి కాలనిలో ఆరేండ్ల చిన్నారి చైత్రపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని టీటీయఫ్ ఉపాద్యాయ సంఘం మండల అధ్యక్షులు భూక్య కభీర్ దాస్ డిమాండ్ చేశారు. మండలంలోని ఆ సంఘంతో జూమ్ మీటింగ్ నిర్వహించిన సందర్భంగా కభీర్ దాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాంకుమార్, మండల ప్రధాన కార్యదర్శి హనుమ, గౌరవ అధ్యక్షులు బాబు లాల్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
కరకగూడెం : చిన్నారి చైత్రపై అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగం రాజును కఠినంగా శిక్షించాలని కోరుతూ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో చిన్నారి చిత్ర పటానికి పూలమాలతో నివాళ్ళు అర్పించారు. నల్ల బ్యాడ్జిలు ధరించి, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసి, స్థానిక పెట్రోల్ బాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు తిప్పని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సురేష్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్, ప్రచార కార్యదర్శి విజరు కుమార్, సభ్యులు పాల్గొన్నారు.
పాల్వంచ : ఆరేండ్ల గిరిజన బాలిక చైత్రపై అత్యాచారం, హత్య చేసిన నింధితుడుని కఠినంగా శిక్షించాలని మాదిగ యూత్ జేఏసీ జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత గద్దల రమేష్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. చిన్నారి కుటుంబానికి కూడా రూ.50 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బూర్గంపాడు : చిన్నారి చైత్రపై అఘాయిత్యానికి నిరసనగా బూర్గంపాడు మండలం, సారపాక ప్రధాన కూడలిలో మస్జీద్-ఏ-సాజిదా కమిటీ కార్యదర్శి జహుర్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ మహిళా విభాగం నుండి రుబీనా, సుల్తానా మాట్లాడారు. కార్యక్రమంలో గౌసియా బేగం, ఎంఏ శంషాద్, ఎండి పర్వీన్ ఆలియా, యాకూబ్ బీ, నస్రీన్, షహనాజ్, సలీమా, కరిష్మా, అమీనా తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : చైత్రపై జరిగిన దాడి, హత్యకు నిరసనగా గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసి సంఘాల ప్రజలు కూడా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు మూడు బాలాజీ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు మోహన్ నాయక్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సురేష్, టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, కాంగ్రెస్ నుంచి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : చిన్నారి చైత్ర శ్రద్ధాంజలి తెలుపుతూ మండలంలోని సారపాక సుందరయ్య నగర్లో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఐద్యా మహిళా సంఘం నాయకురాలు పాపినేని సరోజన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యకాస మండల నాయకురాలు ఎస్కే.అభిదా, కె.నాగమణి, పద్మ, రాధా, ముంతాజ్, మరియమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చంద్రుగొండ : చైత్ర పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కెవిపిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ మండల కార్యదర్శి రాయి రాజా మాట్లాడుతూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కావ్య, దివ్య, గాయత్రి, వంశీ, సౌజన్య, విష్ణు పాల్గొన్నారు.