Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
హైదరాబాద్ సింగరేణికాలనీలో ఆరేండ్ల చిన్నారి చైత్రపై లైంగికదాడికి పాల్పడడంతో పాటు హత్య చేసిన రాజును శిక్షించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం మండలకేంద్రంలోని నాలుగురోడ్ల కూడలి వద్ద ధర్నా నిర్వహించారు.అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రాంరెడ్డికి వినతిపత్రం అంద జేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పార్థనబోయిన విజరుకుమార్, కొణతం లచ్చిరెడ్డి, కడారి ఎల్లయ్య, పల్లెపంగ వీరబాబు, ఉప్పెల్లి ప్రవీణ్, మాలోతు బాలునాయక్, జూలూరిఅశోక్, దాసోజు రమణాచారి, తాళ్లూరి రమేష్‌నాయుడు, ఉరిమిల్ల రామ్మూర్తి, ఇంజమూరిజానయ్య, బీరెల్లి చంద్రారెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేటటౌన్: చిన్నారి చైత్రను హత్య చేసిన నిందితుడు రాజును శిక్షించాలని, బహిరంగంగా ఉరితీయాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ రవీంద్రనాయక్ డిమాండ్ చేశారు.జిల్లా కేంద్రంలోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద ఆ సంఘం నాయకులతో కలిసి చైత్ర కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు బాలు నాయక్, ధరావత్ శంకర్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి ధరావత్ రాజేష్ నాయక్,జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు చందూ నాయక్ నియోజకవర్గ వర్గ అధ్యక్షుడు సేవ్యా నాయక్ జిల్లా నాయకులు శివరాం నాయక్,నాగు నాయక్,తరుణ్ నాయక్,రాజశేఖర్ నాయక్, నర్సింగ్ నాయక్, జాన్సింగ్ నాయక్, వీరు నాయక్, రవినాయక్, చాంప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
చిలుకూరు:మండలకేంద్రంలోని కోదాడ- హుజూర్నగర్ జాతీయరహదారిపై శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ధర్నాకు సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి దొడ్డ వెంకటయ్య, జిల్లా మహిళా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి, పుట్టపాక అంజయ్య, కట్టికోల నాగేశ్వరావు, ఎస్కె.సాయి, బలి కనకయ్య, లక్ష్మీ పాల్గొన్నారు
దీక్షకు కాంగ్రెస్, బీజేపీల మద్దతు
చైత్ర కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో చేపట్టిన మొదటి రోజు శాంతియుత నిరసన దీక్షకు కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బెంజారపు రమేష్‌గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు చుక్కాని మన్మధరెడ్డి, జిల్లా నాయకులు బూర మల్సూర్‌గౌడ్, చల్లమల్ల నర్సింహ సంఘీభావం తెలిపి సేవాలాల్ సేన చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు.
మఠంపల్లి : చిన్నారి చైత్రను అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేసిన రాజును ఎన్కౌంటర్ చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఇరుగు ప్రభు డిమాండ్ చేశారు.సోమవారం రాత్రి ఆ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కొత్తపల్లె ఎల్లయ్య, శ్రీను,నాగబాబు, రాజేష్, గోపి, బీసీ సంఘం నాయకులు వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు పోతబత్తిని శ్రీనివాస్ పాల్గొన్నారు.
గరిడేపల్లి : చిన్నారి చైత్ర ఆత్మకు శాంతిచేకూరాలని కోరుతూ మండలంలోని వెలిదండ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మానవహారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సీవీ. రావు, బాలస్వామి,బుచ్చారావు, కెవి సత్య నారాయణ, కళావతి, సువర్ణ, వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మయ్య,వెంకటేశ్వర్లు, రవీందర్, చంద్రకళ, నాగలక్ష్మి, విద్యార్థులు సారెడ్డిసుజిత, అమూల్య, ప్రశాంతి,జాస్మిని,హారిక, మనోజ, హంసిని, విక్రమ్,ఆదిత్య,అశోక్, ఉదరు పాల్గొన్నారు.
అదేవిధంగా చిన్నారి చైత్రను హత్య చేసిన నిందితుడు రాజును బహిరంగంగా ఉరి తీయాలని స్వేరో సర్కిల్ మండల అధ్యక్షుడు అమరవరపు సతీష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
పెద్దవూర: మండలకేంద్రంలో ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.దీక్షకు మాలమహానాడు సంఘం నాయకులు మద్దతు తెలిపారు.ఈ కార్యక్ర మంలో ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.కిషన్‌నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్‌నాయక్, మాలమహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూతం అర్జున్, నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాజయ్య, నియోజకవర్గ అధ్యక్షులు పోతురాజురవి, చలకుర్తి గ్రామ ప్రధానకార్యదర్శి బూరుగు ముత్యాలు, ఎర్ర కోటేష్, పెద్దవూర మండలం డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు సీిహెచ్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వేములపల్లి : మండలకేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి చల్ల బొట్ల చైతన్య, వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధన శశిధర్‌రెడ్డి, శ్వేత,స్వరూప ,శైలజ, నాగమణి , గీత, గంగా, అనిత ,అలివేలు, అంతమ్మ, ఫాతిమా, సరిత ,నందిని తదితరులు పాల్గొన్నారు.
చింతపల్లి :చిన్నారి చైత్రను Vహత్య చేసిన నిందితున్ని ఉరి తీయాలని సర్పంచ్ రాటకొండ రుద్రమదేవి నరేంద్రప్రసాద్, బీజేపీ దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గాదరి జంగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని కురుమేడు గేటు మీద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకూ బాలికలు, మహిళ లపై దాడులు, అత్యాచారాలు పెరిగిపో తున్నాయన్నారు.మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా ఉండాలంటే నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్టీ సెల్ నాయకులు వడిత్య శంకర్‌నాయక్, జిల్లా గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు కేతావత్ సంతోష్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు అందెకార్ ప్రవీణ్, చేనేత సెల్ జిల్లా కోకన్వీనర్ గుర్రం వెంకటరమణ, ఎస్టీ మోర్చా ప్రధానకార్యదర్శి మల్లేశ్, సీనియర్ నాయకులు రామకష్ణ, ఇస్లావత్ శ్రీనునాయక్, పులికంటి యాదగిరి, కురుమేటి వెంకటరమణ పాల్గొన్నారు.