Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున
నవతెలంగాణ- నల్గొండ
నైజాం దోపిడీ దుర్మార్గాలను ఎదిరించి పోరాడి పేదలకు 10లక్షల ఎకరాల భూమి పంచింది సాయుధ పోరాటం ద్వారనే ఆని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. మంగళవారం కనగల్ మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభ లింగయ్య అధ్యక్షన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.పోరాట దళాలు 3వేల గ్రామాలను దొరల దోపిడీ పాలననుండీ విముక్తి చేశి గ్రామ స్వరాజ్యం స్థాపించాయని అన్నారు. నాడు వేల టన్నుల ధాన్యం, దొరల ధాన్యాగారాలనుండి తీసి పేదలకు పంచారన్నారు. నాలుగువేల మంది ఎర్రజండా బిడ్డలు, ఆ నైజాం, భూస్వామ్య సైన్యాన్ని, రజాకారు ముష్కరులను, పటేల్ సైన్యాన్ని ఎదిరించి పోరాడి, తమ ప్రాణాలను తణప్రాయంగా అర్పించారన్నారు. ఆ పోరాట వారస త్వం నేడు పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటాలు నిర్వహించాలని పిలుపుని చ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కందుల సైదులు సహయ కార్యదర్శి కానుగు లింగస్వామీ మండల కమిటీ సభ్యులు అక్రం, సొము, ముత్యాలు పాల్వాయి శివలీల, సుల్తాన, తదితరులు పాల్గొన్నారు.