Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజాపేట:కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకం వట్టి బూటకమని ఎన్నికల జిమ్మిక్ అని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య మంగళవారం మండలంలోని బొందుగుల గ్రామంలో చేపట్టిన దళిత గిరిజన ,ఆత్మ-గౌరవ దండోరా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు వంటి లక్ష్యాలను తుంగలో తొక్కారని పేర్కొన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందన్నారు. దళిత గిరిజన మరోసారి మోసం చేయడానికి కుట్ర పన్నాడని తెలిపారు . ఆలేరు అభివద్ధి చెందాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తే ఆలేరు కు రెండు వేల కోట్లు నిధులు వస్తాయని తద్వారా ఆలేరు అభివద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సమన్వయకర్త సందిళ్ళ సుధీర్ రెడ్డి ,రాష్ట్ర నాయకులు జనగాం ఉపేందర్రెడ్డ్డి ,కిసాన్ సెల్ నాయకులు బుడిగె పెంటయ్య ,మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ గౌడ్ ,బసిరెడ్డి సురేందర్ రెడ్డి, బాలరాజు, యాదగిరి ,రాంజీ నాయక్, విట్టల్ నాయక్, ఎస్సీ సెల్ నాయకులు శ్రీకాంత్ , ఇం జ నరేష్ ,బల్ల యా దేశ్ ,మర్ల సిద్దేశ్వర్ ,బాల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.