Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-కేతెపల్లి
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డ్డి విమర్శించారు. మండలకేంద్రంలోని అమరువీరుల స్మారక భవనంలో ఆపార్టీ మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులకు 3 ఎకరాల భూమి, డబల్ బెడ్రూమ్ ఇండ్లు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏ ఒక్కటి ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏళ అశోక్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు , మండల కార్యదర్శి చింతపల్లి మారయ్య, కార్యదర్శులు అవారి కిరణ్ కుమార్, వీరబోయిన వెంకన్న, నాయకులు వీరబోయిన చౌడయ్య, గుర్రం లింగయ్య , ఎర్రయ్య , చంద్రయ్య ,ఉపేందర్, జటంగి లింగయ్య పాల్గొన్నారు.