Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ కార్మిక గర్జన పాదయాత్ర బందం
చౌటుప్పల్ రూరల్:చౌటుప్పల్ మండలంలోని పరిశ్రమల యజమానులు తక్కువ వేతనాలు ఇస్తూ వలస కార్మికులతో వెట్టి చాకిరి చేపిస్తున్నారని సీఐటీయూ కార్మిక గర్జన పాదయాత్ర బందం సభ్యులు విమర్శించారు. సీఐటీయూ చేపట్టిన పాదయాత్ర బందం ఏడవ రోజు మంగళవారం చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం, ధర్మోజీగూడెం గ్రామాలలోని ఎస్వీ ల్యాబ్, వైఎం ఫార్మా లాంటి పరిశ్రమలను సందర్శించి అక్కడి వలసకార్మికులతో మాట్లాడారు. పాదయాత్ర కొయ్యలగూడెం గ్రామానికి చేరుకునే సమయానికి 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య జెండాను ఆవిష్కరించారు. ధర్మోజీగూడెంలోని పరిశ్రమల వద్ద వలస కార్మికులని కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ నెలకు 6500 ఇచ్చి పరిశ్రమలలో పనులు చేపిస్తున్నారని ఈ పరిశ్రమల యజమానుల పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం పెరిగిన ధరలకనుగుణంగా అన్ స్కిల్డ్ వర్కర్ కుటుంబ అవసరాలు తీరాలంటే 21 వేల నెల ఖర్చులు కావాల్సి ఉన్నదన్నారు. ఈ కార్మిక గర్జన పాదయాత్రలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య ,కార్యదర్శి పాలడుగు భాస్కర్,రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కోమటిరెడ్డి చెంద్రారెడ్డి,దాసరి పాండు,జిల్లాఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం,దోనూరు నర్సిరెడ్డి,జిల్లా సహాయ కార్యదర్శి ఎండి.పాషా,జిల్లా కమిటీ సభ్యులు నందీశ్వర్,నాయకులు పోతారాజ్ జహంగీర్,కష్ణా,శ్రీనివాస్ రెడ్డి,రేష్మా తదితరులు పాల్గొన్నారు.