Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్తిరుమల్ రెడ్డి
నవతెలంగాణ సంస్థాన్ నారాయణపురం
2013లో ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఆహార భద్రత చట్టం పేదల హక్కు అని ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ కె.తిరుమల్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాన్ని, రేషన్ దుకాణం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆహార భద్రత చట్టం కింద ప్రభుత్వాలు అందజేస్తున్న వస్తువులన్నీ పేదలకు సక్రమంగా అందుతున్నది లేనిది ఆయన తెలుసుకున్నారు.రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా శిశువులకు,గర్భిణీలకు, బాలింతలకు ఇవ్వాల్సిన ఆహార వస్తువులు ఇస్తున్నది లేనిది స్థానికులను అడిగి తెలుసుకున్నారు.సంబంధిత రికార్డులను త్వరలో జరగనున్న జిల్లా సమీక్షా సమావేశంలో అందజేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సరుకుల వివరాలు అందజేసిన శిశువుల, గర్భిణీలు, బాలింతలు ఒంటి వివరాలు పూర్తిగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు అందుతున్నాయా లేవా అని అక్కడున్న గ్రామ ప్రజలతో తెలుసుకున్నారు.మూడు నాలుగు యేండ్ల నుండి ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా తమ పిల్లల పేర్లు మారడం లేదని తమకు రేషన్ కార్డులు రావడం లేదనీ ఆయన దష్టికి తీసుకోవడంతో వెంటనే అక్కడున్న తహసీల్దార్ సంబంధిత జిల్లా అధికారులను ప్రశ్నించారు. లోపాలను సరి చేసి లబ్ధిదారులకు కార్డులు అందజేయాలని సూచించారు. ప్రజాపంపిణీ దుకాణాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం తినడానికి వీలు లేకుండా పురుగులు పట్టి వస్తున్నాయని చిలువేరు ముత్యాలు చైర్మెన్ దష్టికి తీసుకోవడంతో రేషన్ దుకాణాలు తనిఖీ చేశారు. బియ్యాన్ని పరిశీలించారు. వెంటనే రిటర్న్ చేసి లబ్ధిదారులకు స్వచ్ఛమైన బియ్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆహార భద్రత చట్టం ప్రజల హక్కు అన్నారు. అందులో లోపాలు ఉంటే విజిలెన్స్ కమిటీ అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ గుత్త ఉమాదేవి, సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి, డిజిఆర్ఓ ఉపేందర్ రెడ్డి,డిసిఎస్ఓ బ్రహ్మ రావు, సివిల్ సప్లై డిఎం గోపి కష్ణ, డిఈఓ చైతన్య జైన్,డిఎంహెచ్వో సాంబశివరావు, తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీవో శశికళ, డాక్టర్ దీప్తి, సిడిపివో లు అంగన్వాడి సూపర్వైజర్ ఇతరులు ఉన్నారు.
భూదాన్ పోచంపల్లి: రాష్ట్రంలో ఆహార భద్రత అమలు తీరును పరిశీలనలో భాగంగా మంగళవారం ఉదయం మండల పరిధిలోని జలాల్పురం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మెన్ తిరుమల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం ఆరోగ్య రక్ష పథకాల పనితీరును పరిశీలించారు. రాష్ట్రంలో 27 వేలు పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ,అంగన్వాడి విద్యార్థులకు పౌష్టికాహారం కెేసీిఆర్ కిట్టు పౌరసరఫరాల ద్వారా ఆహారాన్ని పథకాల ద్వారా అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలోడీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, హెచ్డిఎంహెచ్ఓ సాంబశివరావు, డీఈఓ చైతన్య జైని, డీఎంహెచ్ఓ యశోద మెడికల్ ఆఫీసర్ యాదగిరి, సత్య ప్రకాష్ ,చంద్రశేఖర్ ,ఎమ్మార్వో దశరథ నాయక్, ఎంపీడీవో బాల శంకర,్ మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.