Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
అ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా 19 పార్టీల ఆందోళన
అ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
నైజాం నియంతత్వానికి, భూస్వాముల దోపిడీకి వెట్టిచాకిరికి వ్యతిరేకంగా సాగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తుందని సీపీిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు విమర్శించారు. సీపీఐ(ఎం) మండల7వ మహాసభ దండు మల్కాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించారు.పార్టీ సీనియర్ నాయకులు మర్రి రాంరెడ్డి జెండావిష్కరణ చేశారు. అమరవీరులకు మహాసభ ప్రతినిధులు పూలు వేసి నివాళులర్పించారు. ఈ మహా సభకు హాజరై ప్రారంభ ఉపన్యాసం చేశారు. జాతీయోద్యమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర లేని ఆర్ఎస్ఎస్, బీజేపీ చరిత్రను వక్రీకరించి, హిందూ ముస్లిముల సమస్యగా చిత్రీకరించడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది కమ్యూనిస్టు యోధులు అమరులయ్యారని గుర్తు చేశారు. 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచి మూడు వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం నిర్మించిన చరిత్ర సాయుధ పోరాటానికి ఉందని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కులాలకు మతాలకు అతీతంగా ఆనాడు ప్రజలు ఉద్యమిస్తే నేడు బీజేపీ దాన్ని మత సమస్య గా చిత్రీకరించడం అభ్యంతరకరమని అన్నారు. దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేయడాన్ని వేగవంతం చేసిందని విమర్శించారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 19 రాజకీయ పార్టీలు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా ఈ నెల 22న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు.. ఈనెల 27న దేశ వ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించనున్నట్టు తెలిపారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. రొడ్డ అంజయ్య,గంగాదేవి సైదులు,చిరిక అలివేలు అధ్యక్షవర్గంగా నిర్వహించిన ఈ మహాసభలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశం, మండల కార్యదర్శి బూరుగు కష్ణారెడ్డి, నాయకులు కీసరి నర్సిరెడ్డి, మండల కమిటీ సభ్యులు రాగిరు కిష్టయ్య, చిరిక సంజీవరెడ్డి,బోయ యాదయ్య,తడక మోహన్,పిసాటి నాగరాజురెడ్డి,చింతల సుదర్శన్,వెల్గ శ్రీధర్ రెడ్డి,జక్కిడి రాంరెడ్డి,మాజీ ఎంపీపీ మర్రి రాంరెడ్డి, నాయకులు మీసాల శ్రీను,మంత్రి యాదయ్య,కాసం వెంకటేష్, మహేష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.