Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అర్వపల్లి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వారోత్సవాలు అమరుల త్యాగాలకు చిహ్నమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు.మండలకేంద్రంలో తెలంగాణ సాయుధపోరాట వారోత్సవాల సందర్భంగా అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం, తిమ్మాపురం, కాసర్లపహాడ్, పర్సాయపల్లి గ్రామాల్లో అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తికోసం అలనాడు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటలో నాలుగు వేల మంది అమరుల య్యారన్నారు.భీమిరెడ్డి నర్సింహారెడ్డి,మల్లు స్వరాజ్యం,, చాకలి ఐలమ్మ మండలకేంద్రానికి చెందిన బొడ్డు గంగులు, నర్సయ్య ఇంకా ఎంతోమంది దళాలు వారీగా ఏర్పడి ప్రజల్లో చైతన్యం చేస్తూ నిజాం వ్యతిరేకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ జైలుపాలై కూడా పోరాటంచేశారన్నారు.వారి త్యాగాలకు ప్రతీకగా వారోత్సవాలను నిర్వహిస్తు న్నామన్నారు. అనంతరం మండలకేంద్రంలో, వివిధ గ్రామాల్లో వారి స్తూపాల వద్ద ఎర్రజెండాను ఎగురవేసి నివాళులర్పించామన్నారు.తెలంగాణ ప్రాంతం లో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంతో మూడువేల గ్రామాలకు స్వేచ్ఛను కల్పించి పదిలక్షల ఎకరాల భూములను పేదలకు ఇప్పించారన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ కమిటీ సభ్యులు చెరుకు యాకలక్ష్మీ, బుర్ర శ్రీనివాస్, మండల కార్యదర్శి ఆవిలయ్య, శ్రీనివాస్, వెంకన్న, అబ్బులుకష్ణయ్య, సైదులు, నర్సయ్య, వినరు, రాజు, వీరస్వామి, బొడ్డుకష్ణయ్య, వీరయ్య పాల్గొన్నారు.