Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మఠంపల్లి
కష్ణా పరివాహక ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉండే తండాల్లో కొంతకాలంగా ఫ్యాక్షనిజం తలపిస్తుంది.తరచూ పాదరక్షలు భగ్గు మంటున్నాయి. బీరు సీసాలతో కత్తులు, కర్రలతో దాడులు జరుగుతున్నాయి.తాజాగా ఈ నెల 13న గుర్రంబోడుతండాలో అధికార పార్టీ వారు కాంగ్రెస్, తటస్థంగా ఉన్న వారి ఇండ్లపై దాడి చేసిన సంఘటన జరగడంతో గిరిజనులు ఉలిక్కి పడుతున్నారు.ఆరునెలల వ్యవధిలో పదికి పైగా ఫ్యాక్షన్ రీతిలో గొడవలు జరగడంతో గిరిజనులు భయబ్రాంతులకు గురవుతున్నారు.బిల్యనాయక్ తండా, అంత్యతండా, రామచంద్రపురంతండా, సుల్తాన్పూర్తండా గ్రామాల్లో ఆధిపత్య దాడులు జరుగుతున్నాయి.గతేడాది పెదవీడులో టీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్యమొదలైన గొడవలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.బీరు సీసాలతో, గొడ్డళ్లతో నరకడం చూస్తుంటే ఫ్యాక్షనిజం కనిపిస్తోందని పలువురు భయాందోళనకు గురవు తున్నామని వాపోతున్నారు.రఘునాధపాలెం బెల్ట్ షాప్లోపాత కక్షలు మనస్సులో పెట్టుకుని ఘర్షణ పడి సినీఫక్కీలో బీరు సీసా పగలగొట్టి పొడిచాడు.చౌటపల్లిలోను ఇరువర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్నాయి.ఏ గొడవా చూసిన అందులో అధికార పార్టీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంటుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.తాజాగా సోమవారం గుర్రంబోడులో జాతరసందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విషయంలో చిన్న గొడవతో ప్రారంభమై చివరకు గ్రామానికి చెందిన అధికార పార్టీ మండల ముఖ్య నాయకుడు స్వయంగా కర్రలు పట్టుకుని తండాలో తిరుగుతూ ఇండ్లపై దాడులు చేస్తున్న దశ్యాలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గొడవలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి గొడవలను నివారించాలని మండలప్రజలు కోరుతున్నారు.