Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ క్షేత్రస్థాయిలో కెళ్లి పరిశీలన చేయని అధికారులు
అ కార్యాలయంలో కాంట్రాక్టర్ , వ్యాపారవేత్తతో విచారణపై అనుమానాలు
అ విషయం తెలిసినా చర్యలకు సిద్ధపడని వైనం..
నవతెలంగాణ-మునుగోడు
మండలంలోని ఓ గ్రామానికి మిషన్ భగీరథ ఇంటింటి నల్ల కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం వేసిన కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్ మండల కేంద్రంలోని ఓ వ్యాపారవేత్త కు మిషన్ భగీరథ ఇంట్రా పైపులను 5 నెలల క్రితం 50కి పైగా పైపులను విక్రయించాడు. అమ్మకానికి సిద్ధమైన పైపులు నవతెలంగాణ కెమెరాలకు చిక్కడంతో మంగళవారం నవ తెలంగాణలో మిషన్ భగీరథ ఇంట్రా పైపులు వ్యాపారవేత్త ఇంట్లో..? అనే కథనాన్ని ప్రచూరిచింది. దీంతో స్పందించిన మిషన్ భగీరథ ఇంట్రా డీిఈ నరేందర్ , ఏ ఈ మణిదీప్ కుమార్ కాంట్రాక్టర్ దక్కించుకుని పైపులను విక్రయించిన గ్రామంలో కాంట్రాక్టు పని విధానాన్ని పరిశీలించారు. పైపులను కొనుగోలు చేసి అమ్మకానికి నిల్వ చేసుకున్న వ్యాపారవేత్త ఇంట్లో ఉన్న పైపులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరపకుండా కాంట్రాక్టర్‌ని , వ్యాపారవేత్తను కార్యాలయంలో విచారణ జరపడంపై పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. మంగళవారం కథనం ప్రచురించిన తర్వాత గతంలో ఉన్న పైపుల కంట స్టాండు పై తక్కువ పైపులు దర్శనమిస్తున్నాయి. విచారణ చేసిన అధికారులు పైపులను స్వాధీనం చేసుకున్నారు ..? వ్యాపారవేత్త కప్పిపుచ్చేరా అనే విషయం తెలియాల్సి ఉంది .ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అమ్మకానికి ఉన్న పైపులను స్వాధీనం చేసుకొని అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్ , వ్యాపారవేత్తకు తొత్తులుగా వ్యవహరిస్తున్న సంబంధిత మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని మండలంలోని ప్రజలు వివిధ ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు .
వివరణకు స్పందించని ఇంట్రా ఏఈ
ఇంట్రా పైపుల అమ్మకం పై విచారణ చేపట్టిన వివరాలకు నవతెలంగాణ ఫోన్ ద్వారా సంప్రదించగా మంగళవారం మిషన్ భగీరథ ఇంట్రా ఏ ఈ మణిదీప్ కుమార్ స్పందించలేదు. తదనంతరం డీఈ నరేందర్‌ను సంప్రదించగా పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను జిల్లా అధికారులకు అందిస్తాం అని తెలిపారు .