Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ-నూతనకల్
భూమికోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని, ఇలాంటి పోరాటాన్ని నేడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఫ్‌ు పరివార్ శక్తులు మతం రంగు పూసి చరిత్రను వక్రీకరిస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సోమవారం మండలంలోని వెంకేపల్లి గ్రామంలో నాగెల్లి యాదగిరి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం చిల్పకుంట్ల గ్రామంలో నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల సతీమణిలను శాలువాలతో ఘనంగా సన్మానించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వెట్టిచాకిరి రద్దు కావాలని, దున్నేవాడిదే భూమి కావాలని నైజాం నవాబు గద్దె దిగాలని సాగిన మహత్తర సాయుధ రైతాంగ పోరాటం కులాలకు,మతాలకతీతంగా సాగిన ఒక చారిత్రాత్మకమైన పోరాటమన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సత్యం, మండల కమిటీ సభ్యులు శ్రీను, గ్రామ శాఖ కార్యదర్శులు గజ్జల శ్రీనివాస్‌రెడ్డి, కట్టాముండ్ల సంజీవ, విజరు, పోలే పాక శ్రీను, బత్తులసోమయ్య, తోట లింగయ్య, అచ్చయ్య, సామవెంకట్‌రెడ్డి, కట్ట నర్సిరెడ్డి, ఎర్ర ఉప్పల్‌రెడ్డి, బాణాల నర్సిరెడ్డి, బాణాల మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.