Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ స్కీమ్‌ల ప్రైవేటీకరణను
అడ్డుకునేందుకే సమ్మె
అ కేంద్ర కార్మిక సంఘాల ఉద్ఘటన
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వ స్కీమ్‌లు ఉంటేనే ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందుతాయని, అటువంటీ స్కీమ్‌లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటీకరిస్తున్నాయిని, ఈ ప్రయివేటీకరణ చర్యలను అడుకునుదుకే సెంప్టెంబర్ 24న జాతీయ స్కీమ్ వర్కర్ల సమ్మెను చేస్తున్నామని, ఈ సమ్మెకు అన్ని వర్గాల ప్రజలకు, మద్దతు ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లందరూ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి.అప్పారావు, ఏఐటియూసీ రాష్ట్ర నాయకురాలు సీతామహాలక్ష్మీ, ఏఎన్టియూసీ జిల్లా ఉపాద్యాక్షులు కాలం నాగభూషణం, ఇఫ్ట్యూ జిల్లా కార్యదర్శి ఎన్. సంజీవ్‌లు పిలుపు నిచ్చారు. సమ్మె సన్నాహక సదస్సు కొత్తగూడెం సీఐటీయూ కార్యాలయంలో సీఐటీయూ శ్రామిక మహిళా జిల్లా కన్వినరర్ జి.పద్మ, ఏఐటియూసి శ్రామిక మహిళా జిల్లా నాయకురాలు విజయలక్ష్మీ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. పౌష్టికాహారం, ప్రాధమిక విద్యా, ప్రాధమిక వైద్య, గ్రామీణ స్థాయిలో పొదుపు బ్యాంకింగ్ సేవలు విస్తరణ, మిడ్డేమీల్స్ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత పేద, మధ్య తరగతి ప్రజలకు సేవలు అందిస్తున్నా స్కీమ్ వర్కర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఆరోపంచారు. చట్టబద్దంగా వెట్టిచాకిరి నిషేదించ బడినప్పటికీ స్కీమ్ వర్కర్ల చేత పాలకులు వెట్టి చాకిరి చేయిస్తు న్నాయని ఆరోపించారు. స్కీమ్ వర్కర్లను ఉద్యోగు లుగా గుర్తించాలని, కనీస వేతనం, రూ.21వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా ఉపాధ్యాక్షులు కె.బ్రహ్మాచారి, ఈసం వెంకటమ్మ, ఏఐటియూసీ జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్, జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లిఖార్జున్, స్కీమ్ వర్కర్స్ యూనియన్ నాయకులరాళ్లు లలిత, మాధవి, అరుణ, నిర్మల, దేవన, ఝూన్సీ, సుగున, చంద్రశీల తదితరులు పాల్గొన్నారు.