Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెండింగ్ బిల్లులను వెంటనే
విడుదల చేయాలి : చావ రవి
జిల్లా ట్రెజరీ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ధర్నా
నవతెలంగాణ-గాంధీచౌక్
ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల , కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను నెల మొదటి తేదీన చెల్లించాలని ,పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టియస్ యుటియఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ.రవి డిమాండ్ చేశారు. గురువారం రోజున స్థానిక ట్రెజరీ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన మరియు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ ధనిక రాష్ట్రంలో వేతనాల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ట్రెజరీస్ డిప్యూటి డైరెక్టర్ వెంటపల్లి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని, జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న, రాంబాబు, మంగీలాల్, గీత, శ్రీనివాసరావు, రమణ, లక్ష్మీనారాయణ, జానిమియా, నాగేశ్వరరావు, జమలయ్య, ఉద్దండు షరీఫ్, రోజా, నర్సింహారావు, ఆల్ పెన్షనర్స్ నాయకులు రంగయ్య, నాగేశ్వరరావు, వీరబాబు పాల్గొన్నారు.