Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గుడి అభివృద్ధికి రూ.3.5 కోట్ల నిధులు
మంజూరు
అ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
నవతెంలగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం గణేష్ టెంపుల్ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవం గురువారం జరిగింది. గుడిలో నూతనంగా ఎన్నికైన కమిటీ చైర్మన్ తాటిపల్లి శంకర్ బాబు, సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి కొత్తగూడెం ఎమ్మెల్యే హాజరై ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడారు. గణేష్ టెంపుల్ అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తానని, ఆలయ అభివృద్ధి కోసం పాలకవర్గం అహర్నిశలు కృషి చేయాలని చైర్మన్, సభ్యులను కోరారు. గాలి గోపురం, గుడి అభివృద్ధి రూ.3.5 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ : కమిటీ చైర్మన్‌గా తాటిపల్లి శంకర్ బాబు, సభ్యులుగా అశోక్‌కుమార్ రాఠీ, భోగ రవి, పల్లపోతు ప్రేమ్‌సాయి, వడ్డెం సతీష్‌కుమార్, తాళ్లూరి ధర్మారావు, తవ్వా వాణి రెడ్డి, మోడె మోహన్‌రావు, సొప్పరి సుధాకర్, కనుకుంట్ల శ్రీను, మేకల నాగబాబు, పోలంపల్లి సురేందర్, కె. వెంకట చంద్ర శేఖర్లు ఎన్నికయ్యారు.