Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జ్రిల్లా పరిషత్ చైర్మన్ లింగాల
కమల్ రాజు
అ టిఆర్ఎస్లో 100 కుటుంబాలు
చేరిక
నవతెలంగాణ- చింతకాని
టీఆర్ఎస్ ప్రజల గుండెల్లోంచి వచ్చిన పార్టీ అని, రాష్ట్రంలో మరో 20 ఏండ్లు అధికారంలో ఉంటుందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు ఉద్ఘాటించారు. గురువారం నాగులవంచ వంకాయలపాటి రామయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. పాతర్ల పాడు గ్రామంలో కాంగ్రెస్ మరియు వివిధ పార్టీల నుండి సర్పంచ్ కాండ్ర పిచ్చయ్య, సొసైటీ చైర్మన్ నల్లమోతు శేషగిరి ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. నూతనంగా పార్టీలో చేరిన వారికి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో చింతకాని మండల పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, వైస్ ఎంపీపీ గురిజాల హనుమంతరావు, జడ్పీటీసీ కిషోర్, చింతకాని, నాగులవంచ సహకార సంఘం అధ్యక్షులు కొండపల్లి శేఖర్ రెడ్డి, నల్లమోతు శేషగిరి, నాయకులు వంకాయలపాటి లచ్చయ్య, వంకాయలపాటి సత్యనారాయణ, రైతు సమన్వయ సమితి మండల కన్వినర్ కిలారు మనోహర్, జిల్లా సమితి సభ్యులు మంకెన రమేష్, ఖమ్మం మార్కెట్ కమిటీ డైరెక్టర్ నారపోగు నాగయ్య, పార్టీ మండల కార్యదర్శి వేముల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.