Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు
అ ఎక్సైజ్ అధికారులపై ఎంపీపీ ఆగ్రహం
నవతెలంగాణ- ముదిగొండ
మండలంలోని మద్యంను అధిక రేట్లకు విక్రయిస్తున్న వైన్స్ దందాపై చర్యలు లేవని ఎంపీపీ సామినేని హరిప్రసాద్ ధ్వజమెత్తారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్ అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుశాఖలపై సమీక్ష సమావేశం కొనసాగింది. ఎక్సైజ్ శాఖ సమీక్ష అనంతరం ఎంపీపీ సామినేని హరిప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్టుషాపులపై చర్యలు తీసుకోవడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లోనే అక్రమ మద్యం వ్యాపారం కొనసాగుతుందని ఆయన అన్నారు. మల్లారం సర్పంచ్ దాసరి స్వామి మాట్లాడుతూ ఆంధ్ర సరిహద్దుల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా అధిక రేట్లకు అమ్ముతున్నారని, ఈ అక్రమ మద్యం దుకాణాలను వెంటనే నిర్మూలించాలన్నారు ఆర్టీసీ బస్సులు సమయాను కూలంగా రావటంలేదని కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, వల్లాపురం సర్పంచ్ అమడాల జక్కర్ తెలిపారు. ఆర్ అండ్ బి రహదారులు గుంటలు పడి ప్రమాదాలకు నిలయంగా మారాయని వెంటనే మరమ్మతులు చేయించాలని సభ్యులు కోరారు. సమావేశానికి పలుశాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, డిటి టీ.కరుణాకరరెడ్డి, ఎంపీడీవో పి.సూర్యనారాయణ, గ్రామ సర్పంచులు కొండమీద సువార్త, మందరపు లక్ష్మి, మాలోజి ఉష, వడ్డెల్లి భువనేశ్వరి, అమరయ్య, ఎంపీటీసీ సభ్యులు కోలేటి అరుణ, కోయ రమేష్, బిచ్చాల బిక్షం, బలంతు జయమ్మ, మండల పరిషత్తు, ఆర్డబ్య్లూఎస్ ఏఈలు వెంకటకృష్ణ, విజయరాజు తదితరులు పాల్గొన్నారు.