Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చుంచుపల్లి ఎంపీడీవో రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
వృత్తి ధర్మంగా పని చేసేవారు ప్రజా హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకుంటారని చుంచుపల్లి ఎంపీడీవో రమేష్ అన్నారు. గురువారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో విధులు నిర్వహించే ఏఎన్ఎం కౌసల్య పదోన్నతి పొంది బదిలీపై వెళుతున్న సందర్భంగా ఆమెను గ్రామస్తులు శాలువా, మెమొంటోతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ రమేష్ మాట్లాడుతూ ఏఎన్ఎం కౌసల్య 13 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ అంకితభావంతో పని చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుమ్మడి సాగర్, ఉప సర్పంచ్ షాహీన్, డాక్టర్ నవ జ్యోతి, పంచాయతీ సెక్రెటరీ చెన్నకేశవ, హెచ్వి.చంద్ర కాంత, విశ్వమాత మదర్ తెరిసా సేవా సంస్థ అధ్యక్షులు గూడవల్లి యాకయ్య, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.