Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సతీష్ గుండపునేని
నవతెలంగాణ-కొత్తగూడెం
వికలాంగులు వారి సమస్యలు విన్నవించేందుకు కొత్తగూడెం ఆర్డిఓ కార్యాలయానికి వచ్చిన వారిని ఉద్యోగి వారిపూ దురుసుగా ప్రవర్తించడం అమానవీయమని టివిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, విజేఏసి చైర్మన్ సతీష్ గుండపునేని అన్నారు. గురువారం కొంత మంది వికలాంగులు వారి సమస్యలపై వినతి పత్రం ఇద్దామని బదిరీ (మాటరాని, చెవులు వినపడని) ఆర్డిఓ లేకపోవటంతో చాంబర్ ముందు విధులు నిర్వహిస్తున్న అటెండర్ నరేష్‌ను సైగల ద్వారా వినతి పత్రం ఎవ్వరికీ ఇవ్వాలని అని అడగ్గా దానికి అటెండర్ నరేష్ నాకు చేయి చూపి మాట్లాడతావా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ, మెడ పట్టుకొని బయటకు గెంటేశాడన్నారు. ఈ విషయం తెలుసుకున్న పాత్రికేయులు నరేష్‌ని అడగా, అప్పుడు దాడి చేయలేదు. ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు దాడి చేస్తామంటూ... దురుసుగా ప్రవర్తించటంతో పాత్రికేయులు విస్తుపోయారు. అంతలోనే అక్కడికి చేరుకున్న టివిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, విజేఏసి చైర్మన్ సతీష్ గుండపునేని కార్యాలయం ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ అటెండర్‌ను విధుల నుండి తక్షణమే తొలగించాలని, అతనిపై 2016 చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన అటెండర్ తాను చేసిన తప్పు పెద్ద మనసుతో క్షమించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునారావృతం కాకుండా చూస్తామని చెప్పారు. వికలాంగులు నిరసన కార్యక్రమాన్ని విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో సాయి, రామకృష్ణ, రమేష్, వెంకటేశ్వర్లు, మంజుల, శ్రీకాంత్ కాసింబి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వ