Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షనర్ల వేతనాలు ప్రతి నెల మొదటి తేదీన విడుదల చేయాలని, సప్లమెంటరీ బిల్లుల నిధుల విడుదలకు నిర్ధిష్ట సమయాన్ని నిర్దేశించాలని యూటీయఫ్ ఆధ్వర్యంలో గురువారం భద్రాచలం ట్రెజరీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా యూటియఫ్ నాయకులు మాట్లాడుతూ సప్లమెంటరీ క్లెయిమ్‌లను టోకెన్ నెంబర్ సమర్పించిన తేదీల వరుస క్రమంలో పారదర్శకంగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం టీఎస్ యుటిఎఫ్ భద్రాచలం డివిజన్ కమిటీ కమిటీ తరపున నిరసన ప్రదర్శన, ధర్నా చేశారు. అనంతరం ఏటిఓ విష్ణు, ఎస్టీఓ సుభద్రలకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీయఫ్ జిల్లా కార్యదర్శి బి.మురళీ మోహన్, జిల్లా కార్యదర్శి తవుర్యా, అనిల్ కుమార్, భద్రాచలం, బూర్గంపాడు అధ్యక్షులు జె.శ్రీనివాస్, మోహన్ కుమార్, సునీత, శైలజ, భాగ్యలక్ష్మీ, సరిత, పుష్పలత, బసవరత్నం, విజరు కుమార్, వెంకటేశ్వర్లు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు ఉద్యోగులు, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెన్షన్స్ ప్రతి నెల మొదటి తేదీన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్టీఓ కార్యాలయం ఎదుట గురువారం టీఎస్ యుటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వరలక్ష్మి జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ పి.జయరాజు మాట్లాడుతూ సప్లమెంటరీ క్లైముల నిధుల విడుదలకు నిర్దిష్టమైన సమయాన్ని నిర్దేశించాలని, సప్లమెంటరీ క్లైములను టోకెన్ నెంబర్ సమర్పించిన తేదీల వరుసక్రమంలో పారదర్శకంగా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల అధ్యక్షులు ఎ.రాంబాబు, ఉపాధ్యక్షులు అన్నపూర్ణ, టేకులపల్లి మండల అధ్యక్షులు బి.రవి కుమార్, కేవీ.కృష్ణారావు, శేషగిరిరావు, గుండాల మండల సభ్యులు వీరన్న తదితరులు పాల్గొన్నారు.
చిన్నారి చైత్రకు నివాళి అర్పించిన ఇల్లందు డివిజన్ కమిటీ
హైదరాబాద్ సింగరేణి కాలనీలో గిరిజన బిడ్డ ఆరేళ్ల పసికందు చైత్ర పై జరిగిన అత్యాచార, హత్య దుర్ఘటనను ఖండిస్తూ నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తులతో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.