Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రోజుకి 100 మంది చొప్పున వ్యాక్సిన్
అ వందశాతం లక్ష్యం సాధించాలి
అ కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ టీకా పడే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రణాళిక రూపొందించు కోవాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీ చేసారు. గురువారం మండల పరిధిలోని నారంవారిగూడెం కాలనీ, గుమ్మడవల్లి ప్రభుత్వ ప్రాధమిక వైద్యశాలలోని వ్యాక్సినేషన్‌ను ఆయన ఆకశ్మికంగా తనిఖీ చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఆవాస గ్రామంలో రోజుకి వందమందికి చొప్పున కోవిడ్ టీకా వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ముందుగా 18 ఏండ్లు నిండిన వారు గ్రామంలో ఎంతమంది ఉన్నారో గుర్తించాలని, ఇప్పటి వరకు ఎంతమందికి టీకా పూర్తి అయిందో నివేదిక ఇవ్వాలని కోరారు. ఇందుకోసం అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనిచేయా లని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్డీఓ స్వర్ణ లత, తహశీల్దార్ చల్లా ప్రసాద్, ఎండీఓ విద్యాధర్ రావు, జడ్పీటీసీ వరలక్ష్మి, ఎంపీపీ శ్రీరామమూర్తి, నారంవా రిగూడెం కాలనీ సర్పంచ్ నారం రాధలు పాల్గొన్నారు.