Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభినందించిన ఎస్ఐ శ్రీకాంత్,
స్కూల్ కరస్పాంటెండెంట్ కృష ప్రసాద్
నవతెలంగాణ-జూలూరుపాడు
మండల కేంద్రంలో ఉన్న సాయి ఎక్స్లెంట్ స్కూల్ విద్యార్థులు పోటీ పరీక్షల్లో దూసుకు వెళ్తున్నారు. సైనిక్ స్కూల్ నందు ఆరవ తరగతి అర్హత పరీక్షలో విజయం సాధించారు. సైనిక్ స్కూల్లో అడుగుపెడుతున్న ఎక్స్లెంట్ స్కూల్ విద్యార్థి బానోత్ తేజేశ్వర్‌ను స్థానిక ఎస్ఐ పి.శ్రీకాంత్ ఉన్నత శిఖరాలకు వెళ్లాలని అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ ఆరెబోయిన కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మా స్కూల్ నందు చదువుతున్న బానోత్ సురేష్ బాబు, మాధవి దంపతుల కుమారుడు బానోత్ తేజేశ్వర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్ నందు ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష పోటీ పరీక్షలలో విజయం సాధించి సైనిక్ స్కూల్ అనుబంధ పాఠశాల అయిన తెలంగాణ రాష్ట్రంలోని, వరంగల్ లోని అశోక్ నగర్ పరిధిలో ఉన్న సైనిక్ స్కూల్లో ఆరవ తరగతిలో ప్రవేశించాడని తెలిపారు.
స్కూల్లో గురుకుల పాఠశాలకు, నవోదయ విశ్వవిద్యాలయాలకు, సైనిక్ స్కూల్ కు చేరే విధంగా పోటీ పరీక్షలకు అతి తక్కువ ఖర్చుతో కోచింగ్ ఇవ్వటమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అదేవిధంగా విద్యార్థు తల్లిదండ్రులు సురేష్ బాబు, మాధవి మాట్లాడుతూ కరస్పాండెంట్ ఆరెబోయిన కృష్ణ ప్రసాద్ పోటీ పరీక్షలలో విజయం సాధించే విధంగా విద్యను బోధించారని అందువల్లే మా అబ్బాయి పరీక్షలలో విజయం సాధించినట్టు తెలిపారు. కరస్పాండెంట్ కు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు.