Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆధునిక జీవనశైలికి అనుగుణంగా సరికొత్త ట్రెండ్లతో కూడిన వస్త్రాలను అందుబాటులోకి తెస్తున్న 'సౌత్ ఇండియా షాపింగ్ మాల్' తన 25వ షోరూమ్‌ను సోమవారం ఖమ్మంలో ప్రారంభించింది. స్థానిక వైరారోడ్డులోని జడ్పీసెంటర్ వీవీసీ కాంప్లెక్స్‌లో నెలకొల్పిన ఈ వస్త్ర దుకాణాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ ప్రారంభించారు. ఉప్పెన ఫేమ్, దక్షిణ భారత సినీ హీరోయిన్ కృతిషెట్టి జ్యోతిప్రజ్వలన చేశారు. వీవీసీ గ్రూప్ సంస్థల అధినేత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ (వీవీ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్లు సురేశ్ శీర్ణ, అభినరు, రాకేశ్, కేశవ్ ఆహుతులకు స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ ఆఫర్‌గా 'కాస్ట్ టు కాస్ట్'కు వస్త్రాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలుగురాష్ట్రాలతో పాటు బెంగళూరులోనూ సౌత్ ఇండియా మాల్ వస్త్ర ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి చేరిందన్నారు. విస్తృత శ్రేణితో కూడిన నాణ్యమైన వస్త్రాలు అందించడం వల్లనే తక్కువ కాలంలోనే నంబర్ 1 స్థాయికి చేరామన్నారు. తెలంగాణలో గొప్ప అవకాశాలున్న మార్కెట్లలో ఒకటైన ఖమ్మంలో తమ 25వ మాల్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని డైరెక్టర్లు పేర్కొన్నారు. నాలుగు లక్షల పైచిలుకు అధునాతన డిజైన్లతో కూడిన వస్త్రాలు మాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. మెన్స్, ఉమెన్స్ అండ్ కిడ్స్‌వేర్ దుస్తులు రూ.150 మొదలు ఆపై ధరల్లో లభిస్తున్నట్లు తెలిపారు. కంచి, ధర్మవరం, పోచంపల్లి, ఉప్పాడ, ఆరణి ఉఉత్పత్తి కేంద్రాలకు చెందిన డిజైన్లు, డ్రెస్ మెటీరియల్స్, కోయంబత్తూర్, కేరళ, బెంగళూరు సల్వార్ సూట్స్, లెహంగాస్, కిడ్స్‌వేర్, మెన్స్ ఎత్తిక్వేర్, మెన్స్‌వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ షాపింగ్ మాల్లో లభిస్తున్నట్లు వివరించారు. ప్రారంభోత్సవ ఆఫర్‌గా 'కాస్టు టు కాస్టు' ఎలాంటి లాభాపేక్ష, పన్నులు లేకుండా కేవలం తయారీకి అయిన ఖర్చుకు మాత్రమే వస్త్రాలు విక్రయిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మెన్ లింగాల కమల్‌రాజు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, పగడాల నాగరాజు, టీఆర్ఎస్ ఆఫీస్ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.