Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ నిరసన
- కలెక్టర్ వీపీ గౌతమ్‌కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం డిమాండ్స్‌డే నిర్వహించారు. దీనిలో భాగంగా ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. వివిధ రకాల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్‌కు అందజేశారు. విలేకరిగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టులపై దాడులు అరికట్టడంతో పాటు వీటి నిరోధానికి జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని, కరోనాతో చనిపోయిన ప్రతీ జర్నలిస్టు కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైన జర్నలిస్టుకు వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని, జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇవ్వడంతో పాటు ఆ కార్డులు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చెల్లుబాట య్యేలా చూడాలని, జర్నలిస్టుల రక్షణకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, సమాచార శాఖకు పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించడంతో మీడియా అకాడమి బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా విద్య అందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి పల్లా కొండల్రావు, అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ సత్తుపాటి రాము, సభ్యులు తేనె వెంకటేశ్వర్లు, ఎస్డీ జావీద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.