Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు : మంత్రి పువ్వాడ
నవతెలంగాణ - చింతకాని
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, పంటలకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ, సాగులో అధిక దిగుబడులు సాధిస్తూ తెలంగాణ అన్నపూర్ణగా నిలుస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ అన్నారు. సోమవారం చింతకాని మండలం జగన్నాధపురం రైతువేదికను ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చా రన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసమే రైతువేదికలు నిర్మిస్తున్నారన్నారు. స్వరాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేసి సాధించారన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను స్వరాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆలస్యం నాగయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, డిసియంఎస్ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటిసి కిషోర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మనోహర్‌బాబు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, నాగులవంచ సహకార సంఘం అధ్యక్షులు నల్లమోతు శేషగిరిరావు, మాజీ సర్పంచ్ కోలేటి సూర్యప్రకాశరావు, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.