Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ఎంఎల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సిఫార్సుతో మంజూరైన సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను సోమవారం ఏదులాపురంలో పంపిణీ చేశారు. జిన్నెక పుల్లమ్మ, ఆనందాచారి, ఎన్.నాగమణికి రూ.81,500 చెక్కులను సీపీఐ(ఎం) నాయకులు వూరడి సుదర్శన్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదులాపురం పంచాయతీతో పాటు చుట్టు పక్కల గ్రామాలలో ఇప్పటి వరకు 81 లక్షలా 50వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. పేద ప్రజలకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్సీ నర్సిరెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు గడ్డం సిద్దు, లాయర్ పి.నరసింహారావు, టీఆర్ఎస్ నాయకులు చక్రాల నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) నాయకులు పి.అనీష్, జె.ఉపేందర్, ఇనగాల రాంబ్రహ్మం, ఎం.మధుసూదన్‌రెడ్డి, సెక్రెటరీ దుండిగాల నాగయ్య, వెంకటేశ్వర్లు, కొండా రవి, లిగయ్య, తదితరులు పాల్గొన్నారు.