Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరా టౌన్
వైరా మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్ మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ ప్రజలు స్థానిక సమస్యలతో సతమతం అవుతున్నారని అన్నారు. పల్లిపాడులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద డ్రైనేజీ, సిసి రోడ్లను నిర్మించాలని, మున్సిపాలిటీ పరిధిలోని అన్ని రోడ్డులకు డ్రైనేజీ నిర్మించాలని. వర్షాకాలంలో రోడ్డులు పంటకాలవలను తలపిస్తున్నాయని అన్నారు. డంపింగ్ యార్డుకు సొంతస్థలం తక్షణమే కొనుగోలు చేయాలని, తాగునీటి పైపులైన్లు లీకులను మరమ్మతులు చేయాలని, పెండింగులో ఉన్న సిసి రోడ్లును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న స్థలాలలోని పిచ్చి మొక్కలను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ (ఎం) వైరా రూరల్ మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బోడపట్ల రవీందర్, మల్లేంపాటి రామారావు, పదవ వార్డు కౌన్సిలర్ కర్నాటి నందిని, పట్టణ నాయకులు గుడిమేట్ల రజిత, పైడిపల్లి సాంబశివరావు, హారి వెంకటేశ్వరరావు, మల్లేంపాటి ప్రసాదరావు, గుడిమేట్ల మోహన్ రావు, గుమ్మ నర్సింహరావు, తోట కృష్ణవేణి, ఉప్పేర్ల రాణి, బందెల ఫౌల్, యనమద్ది రామకష్ణ, వాసిరెడ్డి విద్యాసాగర్ రావు, కామినేని రవి, పాపగంటి రాంబాబు పాల్గొన్నారు.