Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ఖమ్మంరూరల్
మండల పరిధిలో జలగంనగర్ లోని ఎంపీడీవో కార్యాయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం సాధాసీదాగా జరిగింది. ఎంపీపీ బెల్లం ఉమ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అన్ని శాఖల అధికారులు తమ శాఖల గురించి వివరించారు. ముందుగా ఎంపీపీ బెల్లం ఉమ మాట్లాడుతూ.. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తాగునీరు, విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పిట్టలవారీగూడెం, ఆరెకోడుతండా, మంగళగూడెం, ఇందిరమ్మకాలనీలో నీళ్ల ట్యాంకులకు భగీరథ నీరు ఎక్కడం లేదని ఆ సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిదులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మిషన్ భగీరథ ఏఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో నూతనంగా నిర్మించిన వైకుంఠ దామాలకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని జడ్పీటీసీ వరప్రసాద్ అధికారులను కోరారు. సమస్య పరిష్కారిస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. ధరణి, ఇతర భూ సమస్యల గురుంచి ప్రజా ప్రతినిధులు ప్రశ్నించగా వాటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఉప తసీల్దార్ కరుణ శ్రీ హామీనిచ్చారు. ఐకేపి, ఉపాధి హామీ, ఎక్సైజ్ శాఖలపై కూడా సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బీ.శ్రీనివాసరావు, జడ్పీటీసీ యడ్లపల్లి వరప్రసాద్, డిప్యూటీ తసీల్దార్ కరుణ శ్రీ పాల్గొన్నారు.