Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ 60 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన
దళిత బందు అవగాహన సదస్సులో మంత్రి పువ్వాడ
నవతెలంగాణ- చింతకాని
దళిత బంధు పథకంతో దళితవాడలు బంగారు వాడలు లాగా మారనున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని చిన్న మండవ గ్రామంలో గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ల సైడ్ డ్రెయిన్స్ నిర్మాణానికి మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన దళిత బంధు కృతజ్ఞత సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు భట్టి విక్రమార్క గ్రామాల్లో తిరుగుతూ దళిత బంధు పథకం ఆయన సూచన ద్వారానే కేసీఆర్ ప్రవేశపెట్టాడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, డిసియంఎస్ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, సర్పంచ్ కాసిమాల వెంకట్రావమ్మ, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటిసి కిషోర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మనోహర్ బాబు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, నాగులవంచ సహకార సంఘం అధ్యక్షులు నల్లమోతు శేషగిరిరావు, డైరక్టర్లు పర్చగాని లక్ష్మన్, వంకయలపాటి లచ్చయ్య పాల్గొన్నారు