Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మురుగు నీరు, దోమలకు నిలయంగా కాలువలు
వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
నవతెలంగాణ-కరకగూడెం
మండల కేంద్రంతో పాటు పరిసరాల గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారాని మండల ప్రజా వాపోతున్నారు. పారిశుధ్యం లోపించడంతో మురుగు కాలువల్లో వర్షపు నీరు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా
నిలిచిపోతోంది. మండల కేంద్రంలో మురుగు నీరు నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. మురుగు నీరు పారేందుకు సరైన సదుపాయం లేకపోవడంతో, చుట్టు పక్కల నివస్తున్న ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మురుగు కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు, చెత్తాచెదారంతో నిండి నీరు ఎటుపోకుండా ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. ప్రధాన రోడ్డు గుండా మురుగు కాలువలు నిర్మించినా, చెత్తా చెదారం పేరుకుపోయి వర్షపు నీటితో కాలువలు నిండిపోయాయి. దీంతో నీరు నిల్వ ఉండి అవి దోమలకు నిలయంగా మారాయి. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్య పరిష్కరించలని ప్రజలు కోరుతున్నారు.