Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న గ్రామస్తులు
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం దుగినేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల రెడ్డిగూడెం గ్రామంలో ప్రజలకు మంచినీరు అందించే సదుద్దేశంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ గేట్ వాల్ లీకేజీ ఉండటంతో దాంట్లోకి బురద నీరు చేరుతుంది. ఆ నీరే సుమారు 100 నుండి 150 కుటుంబాలకు అందుతుంది. గుప్పెడు నీళ్లు పట్టుకుందామని బిందెలు తీసుకొచ్చిన ప్రజలకు బురద నీరే సాక్షాత్కరిస్తుంది. ఒక వైపు ప్రజలు సీజనల్ వ్యాధులతో గజ గజ లాడుతున్నారు. ప్రతిరోజు చుట్టుపక్కల ఉన్న బురద నీరు గేట్ వాళ్లకు చేరడం అది పైపుల ద్వారా ఇళ్ల లోకి రావడం జరుగుతుంది. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి గేట్ వాల్ దగ్గర మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆ ప్రాంతాల్లో గిరిజన కుటుంబాలు అనేకమంది నివశిస్తున్నా కనీసం పట్టించుకునే నాధుడు లేక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒకవైపు వర్షాకాలం మరోవైపు సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్న ప్రజలకు బురద నీరు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మా సమస్యను పరిష్కరించండి : సుంకరి ముత్తయ్య, రెడ్డిగూడెం
తాగు నీటి కోసం వేసిన పైపులలో బురద నీరు వస్తుంది. ఈ నీరు త్రాగితే జబ్బుల బారిన పడతామని అని భయంగా ఉంది. అధికారులు స్పందించి మా సమస్యను తీర్చాలని వేడుకుంటున్నాం.