Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిథిలావ్యస్థకు చేరిన 108
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- రెవెన్యూ డివిజన్‌కు 108 మంజురు చెయ్యాలి
నవతెలంగాణ-కల్లూరు
రోడ్డు ప్రమాదం జరిగినా, అనారోగ్యాలకు గురైనా ప్రజల్ని ఆస్పత్రులకు తరలించడానికి సంజీవనిలాగా ఉపయోగపడే 108కు సుస్తీ పలకడంతో ప్రజలు ఇబ్బందులకు గురి కావాల్సి ఉంది. ఆపద్బాంధవుడిగా అపర సంజీవనిగా ఉండే 108 అంబులెన్స్‌కే ఆపద వచ్చింది. కారోనా, డెంగ్యూ జ్వరాలు తీవ్రంగా ప్రభాలుతున్నా తరుణంలో రోగులను హాస్పిటల్‌కి తరలించటలో 108 లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వేంసూర్, పెనుబల్లి, కల్లూరు మూడు మండలాలకు కలిపి కల్లూరు నందు ఒక్క 108 అంబులెన్స్ ఉన్నది. అది కూడా టైర్స్ బాగోలేదని, వెహికల్ రిపైర్ ఆని నెలలో 20 రోజులు మాత్రమే పనిచేస్తుంది. ప్రభుత్యం మండలానికి ఒక అంబులెన్స్ అని చాలాసార్లు ప్రచారం చేయటం జరిగింది. కానీ అమలు కావడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని మూడు మండలాలకు అందుబాటులో ఉండేలా ఒక కొత్త 108 అంబులెన్స్‌ని ఇవ్వాలని ప్రజల కోరుతున్నారు. పెనుబల్లి ఏరియా పెద్ద హాస్పిటల్లో కూడా ఒక 108 అందుబాటులో లేక పోవడం ప్రజలు చేసుకున్న తప్పిందా.. లేక ప్రభుత్యం చేస్తున్న నిర్లక్ష్యమా అర్థంకావటం లేదని పలువురు వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి తక్షణమే పెనుబల్లికి 108 వాహనం మంజురు చేయాలని కోరుతున్నారు.