Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీతమ్మ సాగర్ భూ నిర్వాసితుల ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు వినతి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కరకట్ట నిర్మాణం పేరుతో భూములు సేకరించి రైతుల వద్ద నుండి అక్విటెన్స్ తీసుకున్న ప్రతి రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నిర్వాసిత రైతుల ఆద్వర్యంలో అఖిల పక్ష నాయకులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ వర్షా రవికుమార్‌కు అందజేశారు. నిర్వాసిత రైతుల వద్ద నుండి బ్యాంకు ఎక్కౌంట్లు, పట్టాదారు పాస్ సుప్తకం, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో పాటు అక్విటెన్స్ పేరుతో రెవిన్యూ స్టాంపులపై రైతుల సంతకాలు తీసుకుని వారం రోజుల్లో బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పి 45 రోజులు గడుస్తున్నా నేటికి భూ నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్నారు. రైతుల మద్య నెలకొన్న భూ వివాదాలను సైతం రెవిన్యూ అధికారులు పరీశీలించి భూ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ.25 లక్షల చెల్లించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో అఖిల పక్ష నాయకులు కారం పుల్లయ్య, మర్మం చంద్రయ్య, కొమరం దామోదర్, కెల్లా వేణుగోపాల్, సాయన్న, నిర్వాసిత రైతులు లకీëనర్సు, కామరాజు, బాబురావు, లకీëదేవి, సరస్వతి, శాంతమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.