Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ యస్.యల్.కాంతారావు అన్నారు. గురువారం ఐఆర్సీఎస్ ఆధ్వర్యంలో తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వారికి ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వినోద్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీ.మురళీధర్‌లు మాట్లాడుతూ ఐఆర్సీఎస్ చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జీ.రాజా రెడ్డి, లయన్ యోగి సూర్యనారాయణ, విశ్రాంత అధ్యాపకులు లయన్ తిప్పన సిద్ధులు, డాక్టర్ పీ రాజశేఖర్, డాక్టర్ వై.భానుప్రసాద్, డాక్టర్ విజరు, డాక్టర్ తేజస్వినీ, రవి తదితరులు పాల్గొన్నారు.