Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిబ్బంది కొరత
అ ప్రిన్సిపాల్ ఒక్కరే ప్రభుత్వ ఉద్యోగి
అ కళాశాల బెల్లు కొట్టేదీ సిబ్బందే
అ అటెండర్ను కేటాయించాలంటూ వేడుకోలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రభుత్వం విధానాలు పథకరచనలో ఉన్నంత పారదర్శకంగా ఉండవు. అలా ఉంటే ఎప్పటికీ అసమతుల్యత కొనసాగదు. పాలకులు పధకాలను రూపొందిస్తారు. అధికారులు వాటిని అమలు చేస్తారు. ఇవన్నీ నివేదికల్లో నిక్షిప్తం అయి ఉంటాయి. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. దీనికి మంచి ఉదాహరణ పైన ఉన్న చిత్రాలే సజీవ సాక్ష్యం.
మొదటి చిత్రంలో బడి గంట కొట్టేది ప్యూనో అటెండరో అనుకుంటే పొలపాటే. ఆయన స్వయానా ఓ కళాశాల ''ప్రిన్సిపాల్.'' రెండు, మూడు చిత్రాల్లో కనిపిస్తున్న పేర్లు భవనం ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాల. కానీ ఆ భవనం తగ్గట్టు సిబ్బంది, సౌకర్యాలు ఉన్నాయనుకునేరు. ఉంటే మాత్రం మన భ్రమ అనుకోవాల్సిందే.
విషయానికొస్తే....భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలో 2013లో ప్రభుత్వం ఆద్వర్యంలో జూని యర్ కళాశాలను మంజూరు చేసి నాటి నుండే తరగ తులు నిర్వహిస్తొంది. మొదటిలో పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాత్కాలిక విద్యాబోధన చేపట్టారు. 2015లో కళాశాలకు శాశ్వత భవనం నిర్మించారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ అనే నాలుగు గ్రూపులు, 12 సబ్జెక్టులకు తెలుగు -ఆంగ్లం బాషల్లో బోధన చేస్తున్నారు.
గత నాలుగు ఏండ్లు మొదటి సంవత్సరం విద్యార్ధులు చేరికలు పరిశీలిస్తే
2018-2019లో 160, 2019-2020లో 213, 2020-2021లో 150, 2021-2022 విద్యా సంవ త్సరం 212 మందితో రెండో సంవత్సరం విద్యార్ధులతో ప్రస్తుతం మొత్తం 356 విద్యార్ధులు న్నారు.
ఈ కళాశాల అకడమిక్ నమూనా ప్రకారం ఉండాల్సిన సిబ్బంది
ప్రిన్సిపాల్ ఒక్కరు, లెక్చరర్స్ 12 మంది, యూడీసీ, ఎల్డీసీ ఒక్కొక్కరు, లైబ్రేరియన్, పీడీ ఒక్కొక్కరు చొప్పున 17 పోస్టులు మం జూరు చేసారు. ఇంకా అటెండర్, స్కావెంజర్ లేక స్వీపర్ పోస్టులు మంజూరు చేయలేదు. మంజూరు అయిన 17 పోస్టుల్లో ప్రిన్సిపాల్ ఒక్కరే విద్యా శాఖ ఉద్యోగి కాగా 20 మంది కాంట్రాక్ట్, ఇద్దరు గెస్ట్ లెక్చ రర్స్గా పని చేస్తున్నారు. ఊడ్చి శుభ్రం చేసేవారు. బెల్లు కొట్టే వారు లేక పోవడంతో సిబ్బందే టైంటేబుల్ ప్రకారం రోజుకొకరు బెల్లు కొట్టడం, తాళాలు తీయడం-వేయడం చేస్తున్నారు. కరోనా నేపద్యంలో మెరుగైన శానిటైజేషన్ కోసం శానిటేషన్ వర్కర్, ఒక అటెండర్ పోస్టులు మంజూ రు చేయడంతో బాటు వారిని కేటాయించాలని ప్రిన్సిపాల్ సాగర్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.