Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
మండల ప్రాథమిక వైద్యాధికారి సిబ్బంది చేస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గుర్తించింది. గ్రామీణ ప్రాంత ప్రజలలో చైతన్యం కల్పించడంతోపాటు, మెరుగైన వైద్యం అందిస్తున్నందుకుగాను బోనకల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డుకు ఎంపిక అయింది. పీహెచ్సీలో నెలకు సగటున 10 సాధారణ కాన్పులు చేస్తున్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ వారి జీవన ప్రమాణ స్థాయి మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ క్వాలిటీ స్టాండర్స్ సర్టిఫికెట్ అవార్డును పీహెచ్సీ కైవసం చేసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవార్డుకు మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎంపిక కాగా ఇందులో బోనకల్ పీహెచ్సీకి 93.49 శాతం మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ అవార్డుకు జరిగిన ఎంపికకు గాను జూలై 12న జాతీయ నాణ్యత పరిశీలన బృందం సభ్యులు డాక్టర్ శ్రీలేఖ, రాజానీరాణి, రోషిని వర్చువల్ పద్ధతిలో జూమ్ యాప్ ద్వారా పరిశీలించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థితిగతులు, పరిసరాల పరిశుభ్రత, మౌలిక వసతులతో పాటు ప్రధానంగా 12 అంశాలలో పరిశీలన చేశారు. ఫార్మసీ, అందుబాటులో ఉన్న మందులు, ఫార్మా సిస్టర్ హాజరు, జనరల్ క్లినిక్, మందులు, వ్యాక్సిన్ నిల్వ, గర్భిణులు, బాలింతల సంఖ్య, వారికి అందుతున్న సేవలు, సాధారణ ప్రసవాలపై పెడుతున్న శ్రద్ధ, కాన్పుల గది, వార్డులలో వసతులు, పిల్లల టీకా ప్రక్రియ, రోగ నిర్ధారణ పరీక్షలు, నిర్వహణకు అవసరమైనటువంటి సౌకర్యం, డ్రెస్సింగ్, అత్యవసర సేవలు, వ్యాధులపై అవగాహన ఓపికి రోజుకు ఎంత మంది వస్తున్నారు. వైద్య సేవలు పొందుతున్నారా? లేదా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ అన్నింటిపై సంతృప్తి వ్యక్తం చేసిన వైద్య బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కుటుంబ ఆరోగ్య సంస్థ అదనపు సంచాలకులు వందన గునాని సర్టిఫికెట్ ను బుధవారం ఆన్ లైన్ లో అందించారు.
మూడేళ్లపాటు నగదు పురస్కారం
ఈ అవార్డుకు ఎంపిక అయినా పీహెచ్సీకి మూడు సంవత్సరాల పాటు రూ. 3 లక్షలు అదనంగా నిధులు వస్తాయి. వీటితో ఆసుపత్రి అభివృద్ధికి వినియోగించుకోవచ్చు.
అవార్డు లభించడం పట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి మాలతి, జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రామ్ జిల్లా అధికారి నీలోహన, క్వాలిటీ మేనేజర్ ఉపేందర్, మండల ప్రాథమిక వైద్య మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైర్మన్, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, జెడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు తహశీల్దార్ రావూరి రాధిక ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి, ఎస్ఐ బలుగూరి కొండలరావు, మండలంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, పలు శాఖల అధికారులు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తాటికొండ శ్రీకాంత్ నంద్యాల బాలకృష్ణ, వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది : మండల వైద్యాధికారి తాటికొండ శ్రీకాంత్
జాతీయస్థాయి అవార్డు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావడంతో తమపై మరింత బాధ్యత పెరిగింది. తెలిపారు. అవార్డు రావడంలో తనతో పాటు వైద్య సిబ్బంది కృషి కూడా ఎంతో ఉంది. అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో రాష్ట్ర స్థాయిలో ఏ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈ అవార్డు దక్కలేదని, మొట్టమొదటగా బోనకల్లు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈ అవార్డు దక్కిందన్నారు. తన జీవితంలో ఈ అవార్డు మరువలేనిదని, ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.