Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
మహిళ సాధికారితకు ఏర్పాటు చేసిన మహిళా ఉత్పత్తిదారుల సంఘం ఆర్ధికంగా బలోపేతం కావాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన ఆకాంక్షించారు. కారేపల్లి మండలం విశ్వనాధపల్లిలో సిరివెన్నెల గ్రామ సమాఖ్య రైతు ఉత్పత్తిదారుల సంఘంను పరిశీలించారు. వ్యవసాయ పనిముట్లు ఉంచటానికి షెడ్డు నిర్మాణానికి పీడీ శంకుస్ధాపన చేశారు.
ఈ సందర్బంగా పీడీ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్లో వ్యవసాయ పనిముట్లు అద్దెకివ్వటం ద్వారా రూ.6.98 లక్షలు ఆర్జించిందన్నారు. దేశంలో 75 హైరింగ్ సెంటర్లు బెస్ట్ సెంటర్లగా ఎంపిక కాగా రాష్ట్రంలో విశ్వనాధపల్లి, వికారాబాద్ హైరింగ్ సెంటర్లు ఉత్తమ సీహెచ్సీగా ఎంపికైనాయన్నారు. జిల్లాలో పల్లె ప్రకృతి వనాలు 753 ఉండగా వాటిలో 12 లక్షలు మొక్కలు నాటినట్లు తెలిపారు. జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున 10 ఎకరాల నిడివి గల 20 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటుకు ప్రతిపాధనలు పెట్టామని, వాటిలో 9 పూర్తికాగా, 11 ఏర్పాటు దశలో ఉన్నాయని తెలిపారు. పూర్తి అయిన బృహత్ ప్రకృతి వనంలో 2.50 లక్షల మొక్కలు నాటటం జరిగిందన్నారు. రెండో దశలో 5 ఎకరాల నిడివి గల బృహత్ పల్లె ప్రకృతి వనాలను మండలానికి మరో నాలుగు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రెండోదశ బృహత్ పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి సంబంధించి జిల్లా కలెక్టర్ ద్వారా తహసీల్ధార్లు భూమిని గుర్తించే పనిని అప్పగించారని తెలిపారు. జిల్లాలో 7200 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.733 కోట్ల రుణలక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.308 కోట్లు ఇవ్వటం జరిగిందన్నారు. అనంతరం ఉసిరికాయలపల్లిలోని నిర్మించతలపెట్టిన మెగా ప్రకృతి వనానికి స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో వైరా ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, సర్పంచ్ హలావత్ ఇందిరాజ్యోతి, ఎంపీటీసీ వడ్డె అజరుబాబు, డీపీఎం శ్రీనివాసరావు, ఎంపీడీవో మాచర్ల రమాదేవి, ఏపీఎం కల్పన, ఏపీవో రంగనాయకమ్మ, సీసీ తుమ్మలపల్లి అనిల్, హైరింగ్ సెంటర్ మేనేజర్ వడ్డె మాధవి, బీ.వసంత, కళ్యాణి వల్లభినేని ప్రభాకర్, వడ్డె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.