Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
పౌష్టికాహారంతోనే సమతుల్యమైన ఆరోగ్యం చేకూరుతుందని వంకనెంబర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.ఈరు మహిళలకు సూచించారు. గురువారం వంకనంబర్ గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మహౌత్సవంలో భాగంగా గర్భనీలకు శీమంతం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వంకనంబర్, కరిశాలబోడు, సామ్యతండా, వెంకట్యాతండా, అంగన్వాడీ టీచర్లు యశోద, జ్యోతి, సరోజ, కుమారి, వంకనంబర్ పాఠశాల ఉపాధ్యాయులు కె,నాగరాజు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : గర్భిణీలు, బాలింతలతో పాటు చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్య భద్రత ఉంటుందని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి అన్నారు. గురువారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట గెస్ట్ హౌస్ బజార్, దండాబత్తుల బజార్ అంగన్వాడీ సెంటర్ల పరిధిలోని గర్భిణీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అక్షరాబ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ అట్టం రమ్య, ఐసీడీఎస్ సీడీపీఓ రోజారాణి, ఈఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.