Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ భూములపై వివరాలు అడిగిన
సభ్యులు
అ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయిన
తహసీల్దార్
అ సమస్యలను పూర్తిగా చర్చించకుండానే
గంటలో ముగిసిన సర్వసభ్యసమావేశం
నవతెలంగాణ-మణుగూరు
ఆదివాసీ ప్రాంతాలైన బుగ్గ పంచాయతీ, పగిడేరు పంచాయతీ గ్రామాలలో విద్యుత్ సమస్య నిరంతరం తలెత్తుందని బుగ్గ సర్పంచ్ తాటి.రామకృష్ణ, పగిడేరు ఎంపీటీసీ కుంజా కృష్ణకుమారి అధికారులను నిలదీశారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండు చేశారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కారం విజయకుమారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బుగ్గ, పగిడేరు పంచాయతీ గ్రామాలలో చిన్న అంతరాయం కలిగిన విద్యుత్ పోతుందని, ఈ విషయం అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. విపరీతమైన దోమ కాటుకు గురై ప్రజలు విష జ్వరాల భారీన పడుతున్నారన్నారు. అనంతరం చెరువు ముందు సింగారం ఎంపీటీసీ పాయం ప్రమీల, కుంజా కృష్ణకుమారి, తహాసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి ప్రభుత్వ భూముల వివరాలు అడగగా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. సభ్యులు అసహాననానికి గురి అయ్యారు. అనంతరం పాయం ప్రమీల మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల మాటలు పట్టించుకోవడం లేదని, సర్వసభ్య సమావేశానికి విధిగా హాజరు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అధికారిని సభ్యులు అడిగే ప్రశ్నలకు జడ్పీటీసీ సమాధానం చెప్పడంతో సభ్యులు అడ్డుకున్నారు. సమాధానం చెప్పాల్సింది మీరు కాదు అధికారులేనని నిలదీశారు. తహాసీల్దార్ వెళ్లిన వెంటనే సమావేశం ముగిసింది. గ్రామాలలో విషజ్వరాలు, పారిశుధ్య పనులు, విద్యుత్ సమస్య, మంచినీటి, తదితర ప్రజా సమస్యలపై పూర్తిగా చర్చించకుండానే గంటలోనే సర్వసభ్య సమావేశాన్ని ముగించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ నర్సింహారావు, ఎంపీడీఓ వీరబాబు, ఎంపీఓ వెంకటేశ్వరరావు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.