Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విదానాలను నిరశిస్తూ ఈ 27న తలపెట్టిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని ఎన్డీ డివిజన్ నాయకులు దాసరి సాయన్న పిలుపునిచ్చారు. గురువారం బారత్ బంద్ విజయవంతం కోరుతూ ఎన్డి మండల కమిటీ, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆద్వర్యంలో మారాయిగూడెం, అడవిరామవరం గ్రామాలలో ప్రచారం నిర్వహించి మారాయిగూడెం, అడవిరామవరం జంక్షన్లో ధర్నా నిర్వహించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం మండల నాయకులు సున్నం వీరభద్రం, నాయుకులు ముద్దరాజు, బాలక్రిష్ణ, శంకర్, దర్మరాజు, మారయ్య, ధర్మయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గుండాల : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని గత పది నెలలుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా ఈ నెల 27న తలపెట్టిన భారత్ బందును జయప్రదం చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ముక్తి సత్యం, గుంపిడి వెంకటేశ్వర్లు, కోరం సీతరాములు, వెంకటేశ్వర్లు, మంగన్న, రమేష్, లక్ష్మినర్సు, శ్రీను, చంద్రన్న తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి : 27న జరిగే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, ఎన్డీ జిల్లా కమిటీ సభ్యులు బానోత్ ఊక్లా, సీపీఐ మండల కార్యదర్శి గుగులోత్ రామచందర్, టిజెఎస్ నియోజక వర్గ కన్వీనర్ మాన్ సింగ్, వైయస్ షర్మిల పార్టీ నాయకులు బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం సీపీఐ(ఎం) కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసం నరసింహారావు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ : 27న మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ విజయవంతానికే అఖిలపక్షం సమావేశం గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో వీసంశెట్టి పూర్ణచందర్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి దొడ్డా రవికుమార్, ఎన్డీ సబ్ డివిజన్ కార్యదర్శి నిమ్మల రాంబాబు, కాంగ్రెస్ నాయకులు దస్తగిరి, టీడీపీ నాయకులు ఎస్ఏ రెహమాన్, టిజెఎస్ నాయకులు దేవదానం పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, టిడిపి, న్యూడెమోక్రసీ, టిజెఎస్, ముస్లిం మైనార్టీ ఐఖ్య వేధిక నాయకులు దొడ్డా రవికుమార్, రాజు, వాణి, సత్య, ముత్తుజా, మంజూర్, ఇబ్రహిం, విశ్వేశ్వరరావు, వెంకటేశ్వర్లు, కె.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.