Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దోమల భయంతో బిక్కుబిక్కు మంటున్న కాలనీవాసులు
నవతెలంగాణ- ఖమ్మం
దోమల నివారణకు మున్సిపల్ పాలకవర్గం, సిబ్బంది సరైన చర్యలు తీసుకోని ఫలితంగా డెంగ్యూ జ్వరాలతో స్థానిక బీకె బజారు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్, స్థానిక సీపీఎం నగర నాయకులు జాలా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక వార్డులోని మురికికూపంగా ఉన్న రోడ్లను, కబేలా ప్రాంతాలను సిపీఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. అనంతరం వారు మాట్లాడుతూ దోమలకు కేరాఫ్ అడ్డాగా మారి 4 డెంగ్యూ కేసులు రావడంతో స్థానిక 42వ డివిజన్లోని ప్రజలు బిక్కుబిక్కు మంటూ భయంతో గడగడలా డుతున్నా ఇంతవరకు ఇక్కడి ప్రజలను మున్సిపల్ అధికారులు గాని, ప్రజాప్రతి నిధులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి డివిజన్లో శానిటేషన్ పనులు ప్రారంభించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, వైద్య సౌకర్యాన్ని కల్పించాలని వారు కోరారు. కార్యక్రమంలో సీపీఎం స్థానిక నాయకులు సైదులు, మధు, రాజ్ కుమార్, బండి శ్రీనివాస్ పాల్గొన్నారు..