Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణు, కళ్యాణం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మంలోని ధర్నాచౌక్‌లో సీఐటీయు ఆద్వర్యంలో అశావర్కర్లు, అంగన్వాడీలు నిరనన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విష్ణు, కళ్యాణం వెంకటేశ్వర రావులు మాట్లాడుతూ కోవిడ్ కాలంలో ముందు వరుసలో పనిచేసిన స్కీమ్ వర్కర్లకు రక్షణ ఏర్పాట్లు, రిస్క్ అలవెన్స్ లు, కోవిడ్ బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం, సర్వీసుల క్రమబద్ధీకరణ, కనీస వేతనాలు, సాంఘిక భద్రత మరియు పెన్షన్ చెల్లింపులను నిరాకరిస్తున్నదన్నారు. మోడీ సర్కార్ మొండిగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. కనీస వేతనంరూ. 21 వేలు ఇవ్వాలని, పిఎఫ్, ఇఎస్ఎ సౌకర్యం కల్పించాలని, 45వ ఇండియన్ లేబర్ సిఫారన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పి.రమ్య, కే.సుధ రాధ, జె.మంగ, రమణ, నాగమణి ,విజయ, యం.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
చింతకాని : కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కీలకంగా పనిచేస్తున్న స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు కనీస వేతనం రూ 21000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తహశీల్దార్ తిరుమలాచారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి గడ్డం రమణ, ఆశా కార్యకర్తలు కె కమల, రాజేశ్వరి, మంజుల, ఉషా రాణి , అరుణ, ప్రమీల, సరస్వతి,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్ : స్కీం వర్కర్లు జాతీయ సమ్మెలో భాగంగా సిఐటియు వైరా పట్టణ, రూరల్ మండల కమిటీల ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు వైరా పి.హెచ్.సి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వైద్యాధికారి దేవిశ్రీకి అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు వైరా పట్టణ, రూరల్ మండల కన్వీనర్లు అనుమోలు రామారావు, తోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : స్కీం వర్కర్లకు గుర్తింపు గౌరవం ఇవ్వాలని సిపిఎం జిల్లా నాయకులు మాదినేని రమేష్, మదిర నియోజకవర్గ కన్వీనర్ చింతలచెరువు కోటేశ్వరరావులు డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీల ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం డిప్యూటీ తాసిల్దారు అన్సారీకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కుమారి, పద్మ, నాగ మణి, సత్యవతి, ఆశా కార్యకర్తలు సుధారాణి, నాగమణి, సంధ్యారాణి, విజయలక్ష్మి పాల్గొన్నారు.
కల్లూరు : మండల పరిషత్ కార్యాలయంలో ఎండీవో టీ.శ్రీనివాసరావుకు, రెవిన్యూ కార్యాలయంలో తహశీల్దార్ మంగీలాల్‌కు ఆశాకార్యకర్తలు వినతిపత్రం అందజేశారు.
తిరుమలాయపాలెం: మండల కేంద్రంలోని గజ్జల వెంకటయ్య భవనంలో సిఐటియు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తహశీల్దార్ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వసపొంగు వీరన్న, కేవీపీఏస్ రాష్ట్ర నాయకులు కొమ్ము శ్రీను, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి దిండు మంగపతి, కొమ్ము నాగేశ్వరరావు, మండల ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు నలగాటి నాగలక్ష్మి, తిమ్మిడి సైదమ్మ, లక్ష్మి, నాగేంద్ర, లలిత తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి : ప్రభుత్వం తీసుకొచ్చే వివిధ రకాల పథకాలను అమలు చేస్తున్న వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తున్నాయని సీఐటీయూ సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం దేశవ్యాప్తంగా తలపెట్టిన స్కీం వర్కర్ల సమ్మె సీఐటీయూ ఆధ్వర్యంలో విజయవంతమైంది. స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట సీఐటీయూ నాయకులు, కార్యకర్తలు, స్కీం వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు.కార్యక్రమంలో ఉదయశ్రీ, సకీనా, విజయలక్ష్మి, జ్యోతి, జయప్రద, సీత, లలిత, జయమ్మ, కుమారి, నాగేంద్ర, రాణి, రజిని పాల్గొన్నారు.
నేలకొండపల్లి : స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అఖిలభారత సమ్మెలో భాగంగా స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా ఆందోళన నిర్వహించారు. ఎంపీవో నెల్లూరి వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పగిడికత్తుల నాగేశ్వరరావు, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి బి కోటేశ్వరి, నాయకులు కుమారి, నాగమణి, అన్నపూర్ణ, వెంకటరమణ, ఉమాదేవి రమణ పాల్గొన్నారు.
కూసుమంచి : సీఐటీయు ఆద్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి గోపె వినరు కుమార్, నాయకులు చీర్ల చక్రి, దోమల రజిని, గోపె ప్రమీల, బొంత కల్పన, కన్నెబొయిన రేణుక, లోడిగా మంగతాయి, కడారీ నాగమణి, నాగమణి, సుమలత, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
బోనకల్ : స్కీమ్ వర్కర్ల సర్వీసులను వెంటనే క్రమబద్దీకరించేందుకు 45, 46 వ అంతర్జాతీయ లేబర్ కాన్ఫరెన్స్ ల ప్రతిపాదనలను అమలు చేయాలని సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్ల తలపెట్టిన అఖిలభారత సమ్మె లో భాగంగా శుక్రవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ రావూరి రాధికకు అందజేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు చేబ్రోలు ఉషారాణి కొమ్మినేని పద్మ అ గూగు లోతు ఉష పి రాజ్యలక్ష్మి వనిత రాజ్యం పి జ్యోతి నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.
మధిర: స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట స్కీమ్ వర్కర్లలు ధర్నా నిర్వహించారు. సీఐటీయు ఆద్వర్యంలో తహశీల్దార్ సైదులుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు, సిఐటియు నాయకులు పడకండి మురళి, ఆశాలు రేణుక, నాగమణి, పద్మ, శారద, సుబ్బారావు, నరసింహారావు, లాలయ్య, అనంత రాములు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం: జిల్లా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు)జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లు అఖిలభారత సమ్మెలో భాగంగా శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిపాలన అధికారి రవీంద్రనాథ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి బి.వేణుగోపాల్, ఉపాధ్యక్షులు జె.కొండల్, సహాయ కార్యదర్శులు కృష్ణమోహన్, అలీ, యాకోబు, సభ్యులు సత్య ప్రసాద్, రాజేష్, నాగరాజు, నరసయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.
వేంసూరు: మండల కేంద్రంలోని ఎర్ర రామయ్య భవనంలో సీఐటీయు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి తహశీల్డార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్, అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల కార్యదర్శి సింగపోగు జీవమ్మ, బివిఎస్ఎన్ లక్ష్మి, శాంత కుమారి, పుష్ప కుమారి, రాజ్యలక్ష్మి, శాంతామని, మంగ తాయారు, స్వర్ణ, మహాలక్ష్మి, చామంతి, ధనమ్మ, రజినీ తదితరులు పాల్గొన్నారు.
కామేపల్లి : సీఐటీయు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తాహశీల్దార్‌కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు దుగ్గి పాపారాణి, దుగ్గి క్రిష్ణ, బాదావత్ శ్రీను,ఉప్పతల వెంకన్న, రమణ, పద్మ, వసంత, జ్ఞానమ్మ, స్వరూప, కోటమ్మ, అహల్య పాల్గొన్నారు.