Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేటు సంస్థలకు ధారాదత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు విమర్శించారు. మండల కేంద్రంలోని రామిశెట్టి పుల్లయ్య భవనంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో అన్ని రంగాల సంస్థలు దెబ్బతిన్నా వ్యవసాయ రంగమే దేశానికి వెన్నుముకగా నిలిచిందన్నారు. అటువంటి వ్యవసాయరంగాన్ని మోడీ ప్రభుత్వం 3 నూతన నల్ల చట్టాలను అమలు పరిచి రైతుల వెన్ను విరుస్తోందని విమర్శించారు. ఈనెల 27 వ తారీఖున కాంగ్రెస్, తెలుగుదేశం, వామపక్షాల, అఖిల పక్షం ఆధ్వర్యంలో దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులపైన కేసులు బనాయించి వారిని నిర్బంధాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములపై అక్టోబర్ 5వ తేదీన అశ్వారావుపేట నుండి అదిలాబాద్ వరకు ఒక్క రోజు నాలుగు వందల కిలోమీటర్ల దూరం రహదారుల దిగ్బంధం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. హుజురాబాద్ ఎన్నికల గెలుపు కోసం దళిత బంధు పథకం ప్రకటించారని, రాష్ట్ర మంతటా దళితులతో పాటు వెనుకబడిన తరగతులు, గిరిజనులు, రోజువారి వేతనంపై పని చేస్తున్న అందరికీ ఈ పథకం అమలు పరచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు మాదినేని రమేష్, మధిర నియోజకవర్గ పార్టీ ఇంచార్జి చింతలచెరువు కోటేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, నాయకులు గొల్లపూడి కోటేశ్వరరావు, సగ్గుర్తి సంజీవరావు, ఆంగోతు వెంకటేశ్వర్లు, కోటి సుబ్బారెడ్డి, అనుమోలు వెంకటేశ్వరరావు, నల్లమోతు హనుమంత రావు, దేవరకొండ రామకృష్ణ, దూదిగం బసవయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, షేక్ బాబు పాల్గొన్నారు.
బోనకల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలం బిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్వహించనున్న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అఖిల పక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల సంయుక్త సమావేశంలో సిపిఎం, కాంగ్రెస్, టిడిపి, సిపిఐ నాయకులు మాట్లాడుతూ వర్తక వాణిజ్య వర్గాలు, చిరు వ్యాపారులు, ఆటో కార్మికులు, హౌటల్ వ్యాపారులు అందరూ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ డిసిసి కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, టిడిపి మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ, సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, ఖమ్మం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నందమూరి సత్యనారాయణ, రాష్ట్ర గిరిజన సంఘం కార్యదర్శి బానోతు శివల నాయక్, మండల కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు బుక్యా బద్రు నాయక్, సిపిఐ సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం, సీనియర్ తెలుగుదేశం నాయకులు కొమ్మినేని సైదేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్ : భారత్ బంద్‌లో అందరూ భాగస్వా మ్యం కావాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం పిలుపు నిచ్చింది. వైరా సిపిఐ(ఎం) కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ(ఎం), సిపిఐ, న్యూడెమోక్రసీ పార్టీలు బంద్ జయప్రదం కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, కాంగ్రెస్ నాయకులు శీలం నర్సిరెడ్డి, న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి, కంకణాల అర్జునరావు, తెలుగు దేశం సినీయర్ నాయకులు మందడపు మధుసూదనరావు, సిపిఐ మండల కార్యదర్శి యమాల గోపాలరావు, సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, తెలుగు దేశం వైరా పట్టణ అధ్యక్షులు కిలారు సురేందర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఏదూనూరి సీతారాములు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మధిర: 27న నిర్వహించనున్న భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని మధిర అఖిలపక్ష నాయకులు కోరారు. శుక్రవారం సీపీఎం ఆఫీస్‌లో జరిగిన అఖిల పక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల సంయుక్త సమావేశంలో నాయకులు మాట్లాడుతూ వర్తక వాణిజ్య వర్గాలు, చిరు వ్యాపారులు, ఆటో కార్మికులు, హౌటల్ వ్యాపారులు అందరూ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, మిరియాల రమణ, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు, సీపీఎం మండల పట్టణ కార్యదర్శులు మందా సైదులు, శీలం నర్సింహారావు, సిపిఐ మండల పట్టణ కార్యదర్శులు ఊట్లకొండల రావు, బెజవాడ రవి, అఖిల పక్ష ప్రజాసంఘాల నాయకులు అద్దంకి రవి, పెరుమాళ్లపల్లి ప్రకాశరావు, సత్యనారాయణ, నాగకృష్ణ, మద్దాల ప్రభాకర్, మురళి, మధు తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి : బంద్ జయప్రదం కోసం స్థానిక చలమల సూర్యనారాయణ భవన్లో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం మండల కార్యదర్శి చలమల విట్టల్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కృష్ణవేణి, వడ్లమూడి కృష్ణయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు యలమర్తి నాగ ఆంజనేయులు, న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి బీరెల్లి లాజర్, సిపిఎం మండల నాయకులు గాయం తిరుపతిరావు, చలమల నరసింహారావు, కంటే సత్యం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కలిగిన వెంకటేశ్వరరావు, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకతోటి కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి :ఈనెల 27న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి గుడవర్తి నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక రావెళ్ల భవనంలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు పగిడికత్తుల నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు ఏటుకూరి రామారావు, కేవీ రామిరెడ్డి, రావెళ్ళ సుదర్శన్ రావు, కాంగ్రెస్ నాయకులు బొడ్డు బొందయ్య, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజని, టిడిపి నాయకులు నల్లమాసు మల్లయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పగిడికత్తుల రామదాసుపాల్గొన్నారు.
మధిర: బంద్‌ను విజయవంతం చేయాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. శుక్రవారం జరిగిన విద్యార్థి సంఘాల అఖిలపక్ష సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు, ఏఐఎస్ఎఫ్ మధిర డివిజన్ కార్యదర్శి ఉగ్గం సురేష్, ఎస్ఎఫ్ఐ టౌన్ అధ్యక్షుడు పేరు స్వామి, సాయి పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని,నాలుగు లేబర్ కోడ్ లను ఉపసంహరించుకోవాలని,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేయడం వెంటనే నిలిపివేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 27 న జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర రావు తెలిపారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్ లో శుక్రవారం వ్యకాస జిల్లా నాయకులు పొన్నెకంటి సంగయ్య అధ్యక్షతన వ్యకాస ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో సిపిఎం మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, నాయకులు వడ్లమూడి నాగేశ్వరరావు, బందెల వెంకయ్య, కొట్టే రామయ్య, నెరేళ్ల ఉపేందర్, కర్లపూడి వెంకటేశ్వర్లు, యర్రా నర్సింహారావు, జింక బాలరాజు, లింగంపల్లి వీరాస్వామి, పి.నాగేశ్వరరావు, జి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.