Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ స్వార్ధంతో అబద్దపు ప్రచారాలు చేస్తే
చర్యలు తప్పవు
అ జెడ్పీటీసీ తెల్ల సీతమ్మ, దిశా కమిటీ
సభ్యుడు మట్టా
నవతెలంగాణ-దుమ్ముగూడెం
టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు రాజీనామా చేసినట్టు పార్టీకి చెందిన కొంత మంది నాయకులు స్వార్ధంతో అబద్దాలు ప్రచారం చేస్తూ పార్టీ నాయకత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అటువంటి వారికి చర్యలు తప్పవని జెడ్పీటీసి తెల్లం సీతమ్మ, దిశ జిల్లా కమిటీ సభ్యుడు మట్టా వెంకటేశ్వరరావు (శివాజీ) అన్నారు. శుక్రవారం లకీëనగరం మండల పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు అన్నె సత్యనారాయణ మూర్తి, ప్రదాన కార్యదర్శి కణితి రాముడుతో పాటు మండల కమిటీ సభ్యులకు పార్టీ సర్పంచ్లు, ఎంపిటిసిలు పార్టీ శ్రేణులు అభినందించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అదిస్టానం నిర్ణయం మేరకు నూతనంగా ఎన్నికైన మండల కమిటీకి అన్ని విదాలా సహకరించడంతో పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అభినందించిన వారిలో ఎంపిటిసిలు తునికి సీత, మడకం రామారావు, సర్పంచ్లు సరియం సీతారామయ్య, కాటిబోయిన వెంకటేవ్వర్లు, నూపసుమిత్ర, కారం జయమ్మ, కల్లూరి రజని, జుంజురి లకీë, పూజారి కృష్ణవేణి, ఉన్నారు.