Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రక్షణ పరికరాలు అందజేయాలి
అ ఆర్సీ హెచ్‌పీ కాంట్రాక్టుకార్మికుల సమ్మె
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్‌లోని ఆర్సిహెచ్పి కోల్ హ్యాడ్ లింగ్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. శుక్రవారం బొగ్గు బంకర్ వద్ద కార్మికులు గేటుమందు ఆందోళన నిర్వహించారు. ఈ సంర్భంగా వారు మట్లాడారు. సింగరేణి యజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి నెల ఏడవ తేదీన జీతాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ 24వ తేదీ వరకు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికుల కుటంబాలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారన్నారు. ఆరోగ్యం బాగులేక విధులకు రాని పక్షంలో లీవ్ ఫెనాల్టీ వసూళ్లు చేస్తున్నారన్నారు. రోజుకూలీ రూ. 400కాగా పనికి రాని రోజు ఎదురుగా రూ. 300 ఇవ్వాలని కాంట్రాక్టర్ వేదిస్తున్నాడన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నినాదాలు చేశారు. ఈ నిరసనకు స్పందిస్తూ సింగరేణి యాజమాన్యం, యూనియన్ నాయకులు, కాంట్రాక్టర్లు చర్చలు జరిపి కాంట్రాక్ట్ కార్మికులకు శుక్రవారం సాయంత్రం నాటికి వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రతి నెల 7వ తారీకు లోపు జీతాలు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కాంట్రాక్టు కార్మికులుఆందోళన విరమించారు. కార్మికుల మెరుపు నిరసన సమ్మెతో నాలుగు గంటల పాటు బంకర్ పనులు నిలిచిపోయాయి. బొగ్గు బెల్టు రన్నింగ్ ఆగిపోయిది. రైలు, రోడ్డు ద్వార బొగ్గు రవాణాకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు రాసూరి శంకర్, మడిపల్లి కరుణాకర్, రాజేష్, ఫారూక్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.