Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాడివేడిగా మండల పరిషత్ సమావేశం
నవతెలంగాణ-అశ్వారావుపేట
మూడు నెలలకో సారి జరిగే మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అశ్వారావుపేటలో శుక్రవారం వాడివేడిగా సాగింది. ఎంపీపీ శ్రీరామమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మిషన్ భగీరథ ఇంట్రా విభాగం ఏఈ లక్ష్మి ఆ శాఖ నివేదిక తెలుపుతుండగా తెరాస ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర, కో-ఆప్షన్ సభ్యుడు ఎస్.కె పాషాలు మిషన్ భగీరథ మంచినీళ్ళు సకాలంలో రావటం లేదు, అలాగని ప్రత్యామ్నాయ పద్ధతిలో మంచినీటి సరఫరాకు బోర్లు వేయడానికి చట్టం అడ్డొస్తుంది మరి ప్రజల దాహం తీరేదెలా అంటూ ప్రశ్నించారు. పంచాయతీల్లో ఏ నిధులు ఎంత, ఎందుకు ఖర్చు చేస్తున్నారో సమావేశాలు ఎపుడు నిర్వహిస్తున్నారో కనీస సమాచారం ఉండటం లేదని అచ్యుతాపురం ఎంపీటీసీ దుర్గ సమదృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జెడపీటీసీ వరలక్ష్మి, తహశీల్దార్ చల్లా ప్రసాద్,ఎండీఓ విద్యాసాగర్ రావు, ఎంఈఓ క్రిష్ణయ్య, కృష్ణ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.