Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
తెలంగాణ రాష్ట్రంలోలో మొట్టమొదటగా కోరమాండల్ నుంచి రైతులకు మరో కొత్త ఎరువు గ్రోశక్తి ప్లస్‌ను మధిర వ్యవసాయ పరిశోధన సంస్థ సీనియర్ శాత్రవేత్త డాక్టర్ రుక్మిణి దేవి, కొరొమాండల్ ఇంటర్నేషనల్ సీనియర్ జనరల్ మేనేజర్ బ్రాండింగ్ నికేష్ బైడ్యా, సీనియర్ ఆగ్రోనోమిస్ట్ కె. మధుసూదన్, జోనల్ మేనేజర్ జే.సజన్‌కుమార్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని రావినూతల గ్రామంలో శుక్రవారం చెన్న సుధీర్ కుమార్ ఫెర్టిలైజర్స్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ దారులకు, రైతులకు గ్రోశక్తి ప్లస్ అందించే ప్రయోజనాలను, వాటి అత్యున్నత నాణ్యమైన ఉత్పత్తి వివరాలను వివరించారు. కోరొమాండల్, మన గ్రోమోర్ సెంటర్, అగ్రోనమిస్ట్ టీమ్, న్యూట్రిక్లినిక్స్ ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే కాకుండా రైతులకు సంపూర్ణ వ్యవసాయ పరిష్కారాలను అందించడానికి కృషి చేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిధిగా గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, ఉప సర్పంచ్ బోయినపల్లి కొండా, కంపెనీ ప్రతినిధులు, ఎమ్ ఓ ఎస్ లు అనిల్ రెడ్డి, ప్రీతం, చిరంజీవి, ఆగ్రోనోమిస్ట్ వాసు గంగాధర్, లక్ష్మణ్, ప్రముఖ పురుగు మందుల వ్యాపారి చెన్నై సుధీర్ కుమార్ వివిధ గ్రామాల రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.