Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
పోడు సాగుపై నిర్భంధాలను నిరసిస్తూ పోడులో సాగుతున్న పోడు రైతుల పోలికేకతో ప్రభుత్వం కళ్లు తెరవాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కే.నాగేశ్వరరావు అన్నారు. శనివారం కారేపల్లి మండలం చీమలపాడులో జరగనున్న పోడు రైతుల పొలికేక సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ మాణిక్యారం, కారేపల్లి, ఉసిరికాయలపల్లి గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలు పోడు సాగుకు హక్కు కల్పిస్తానని కేసీఆర్ హామి అమలు చేయకుండా తాత్సర్యం చేస్తున్నారన్నారు. ఒకవైపు పోడుకు హక్కు కల్పిస్తానంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మరోవైపు ఫారెస్టు, పోలీసులను ఉసికొల్పి భూములను లాక్కొంటూ పేదల బతుకుల్లో చీకటిని నింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు రైతుల ఆవేదనతో ఐక్యమై పోరాటాలకు సిద్దంగా ఉండాలన్నారు. పోరాటాలతోనే హక్కు సాధించుకుందామనని తెలిపారు. చీమలపాడులో జరుగు పోడు పొలికేకకు సీపీఐ(ఎం), సీపీఐ, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, టీడీపీ, జనసమితి రాష్ట్ర నాయకత్వం హజరు కానుందన్నారు. దీనిని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు వజ్జా రామారావు, కరపటి సీతారాములు, పండగ కొండయ్య, పాయం ఎర్రయ్య, పెంటయ్య, ఎరిపోతు భద్రయ్య, కరపటి రాంబాయి, ధనలక్ష్మి, కల్తి రామచంద్రు, కుర్సం శ్రీను తదితరులు పాల్గొన్నారు.