Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నోట్ పుస్తకాలు, పలకలు అందజేత
నవతెలంగాణ-వేంసూరు
పేద విద్యార్థులకు తన వంతు సహాయం చేయాలని సంకల్పంతో ముందుకొచ్చిన చెరుకు రవీందర్‌రెడ్డి దంపతులను ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఎర్రగుంటపాడు గ్రామంలో పాఠశాల నందు పేద విద్యార్థులకు పది వేల రూపాయలతో పాఠశాలలో ఉన్న మొత్తం విద్యార్థిని విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు మొదలగున వస్తువులను శుక్రవారం ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, ఎంఈఓ చలంచర్ల వెంకటేశ్వరావుల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల మీద మమకారంతో గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు అనేక రూపాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇదేవిధంగా తన సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని, పేద విద్యార్థులకు సహాయం చేయడం సంతృప్తిగా ఉంటుందన్నారు.కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం కృష్ణకుమారి, ప్రతాప్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి దివ్య తదితరులు పాల్గొన్నారు.